మహేశ్ నటించిన ఆ మూవీ రీ రిలీజ్ చేస్తే ..ఏకంగా 50 కోట్లు పైగానే కలెక్ట్ చేస్తుంది తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్గా మారిపోయింది . మనం చూస్తూనే ఉన్నాము.. గతంలో రిలీజ్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. అదే విధంగా గతంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమాలను సినిమాలకు సీక్వెల్ పేరిట తెరకెక్కిస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా సీక్వెల్స్ రావడం అలాగే రీ రిలీజ్ లు అవుతూ ఉండడం చూస్తున్నాము. అయితే ఇలాంటి మూమెంట్ లోనే మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త హైలైట్ గా మారింది .

మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఒక్కడు . గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది. భూమిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా కబడి -లవ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా బాగా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది . కాగా ఈ సినిమాను కోలీవుడ్లో “గిల్లి” అనే పేరుతో రిలీజ్ చేశారు మేకర్స్. కోలీవుడ్లో స్టార్ హీరో విజయ్ దళపతి త్రిష జంటగా నటించారు .అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది .

తెలుగులో కన్నా కోలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గమనార్హం. కాగా రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ మళ్ళీ ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు . సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసి పెట్టింది . ఇది ఒరిజినల్ కలెక్షన్స్ కు సమానం . దీంతో ఇప్పుడు ఇదే న్యూస్ ని బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. ఇప్పటివరకు అలా రిలీజ్ చేసిన సినిమాలు ఏవి కూడా ఇలాంటి ఒక సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేయకపోవడం గమనార్హం. ఆ ఘనత కేవలం గిల్లికి మాత్రమే దక్కింది..!!