వాట్.. ఐకాన్ స్టార్ నటించిన రెండు భారీ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయా.. కారణం ఏంటంటే..?!

మెగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన చివరిగా నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఇక మరోసారి ఈ సినిమా సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న పుష్ప2తో మ‌రోసారి త‌న స‌త్త చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. గంగోత్రి సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి రాఘవేంద్రరావు చేతుల మీదగా పరిచయమైన బన్నీ.. నేడు ఐకాన్ స్టార్ గా, పాన్ ఇండియా లెవెల్ లోను.. వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇంత పెద్ద స్టార్ హీరో అనుకుంటే ఎంత పెద్ద సినిమానైనా ఇట్టే తీయగలడు.

పైగా తమ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ కూడా చేతిలోనే ఉంది. అయినా కూడా అల్లు అర్జున్ చేయాల్సిన రెండు బడా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంత‌కి ఆ రెండు సినిమాలు ఏంటి.. అవి ఆగిపోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఐకాన్ అనే సినిమా రావాల్సి ఉంది. అయితే గతంలో ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే కారణాలు ఏంటో తెలియదు గాని.. సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమాకి వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాల్సి ఉండగా వీరిద్దరి కాంబో కి సెట్స్ పైకి రాకముందే చెక్ పడింది.

ఇక ఈ సినిమా ఫ్యూచ‌ర్‌లో అయిన వ‌చ్చే అవకాశం ఉందో లేదో వేచి చూడాలి. అలాగే కొర‌టాల శివ డైరెక్షన్‌లో కూడా అల్లు అర్జున్ సినిమా తీయాల్సి ఉండగా.. అప్పటికే ఆచార్యతో ఫ్లాప్ ఎదురైందని.. ఆ కారణంతో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రావలసిన సినిమాలు ఆపేశాడని టాక్‌. ఇదే స్టోరీతో ప్రస్తుతం దేవర తెరకెక్కుతుందని టాక్. కారణాలు ఏమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలు కూడా ఇలా మధ్యలో ఆగిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది.