అఖిల్ ..నాగార్జున కొడుకు.. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు …ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .. కానీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు . అక్కినేని నాగార్జున కూడా కొడుకు లైఫ్ లో సెటిల్ అయితే చూడాలి అని కొడుకు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అని బాగా బాగా కష్టపడుతున్నాడు . కానీ ఆ దేవుడు ఇంకా కరుణించలేదు . అఖిల్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కాగా అఖిల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . అఖిల్ అక్కినేని చైల్డ్ హుడ్లో నటించిన సినిమా సిసింద్రీ .
ఈ సినిమా అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ గా ఉంటుంది . అక్కినేని అఖిల్ ఈ సినిమాలో నటించే టైంలో ఆయన వయసు చాలా చాలా చిన్నది.. అంటే నాగార్జున అమల ఇద్దరు కేరింగ్ లో ఉండే ఏజ్. ఇద్దరు కలిసి ఈ సినిమా షూట్ కి తీసుకెళ్లేవారు .. అంత చిన్న వయసు. అయితే ఒకరోజు అమల కొన్ని కారణాలవల్ల షూటింగ్ కి రాలేకపోయిందట .. నాగార్జున కూడా వేరే సినిమా షూటింగ్లో సిసింద్రీ షూటింగ్ కి రాలేదట.. అప్పుడు కేర్ టేకర్ దగ్గర అఖిల్ను షూటింగ్ కి పంపించారట . ఇదే మూమెంట్లో సిసింద్రీ సినిమా షూట్ లో ఉన్న టీపాయ్ను పట్టుకొని లేవడంతో అఖిల్ తలకు గాయమైందట .
పెద్ద గాయం కూడా కాదు చిన్న గీత ఈ విషయం తెలుసుకున్న నాగార్జున అమల వెంటనే హుటాహుటిన కార్లు వేసుకొని షూటింగ్స్ స్పాట్ కి వచ్చేశారట. అప్పుడే డైరెక్టర్ అక్కడున్న సిబ్బందికి చెప్పేసారట. నాగార్జున గారు ఇప్పుడు మిమ్మల్ని కొట్టిన కొడతారు.. రెడీ అంటూ హింట్ కూడా ఇచ్చేసారట . అయితే అదే మూమెంట్లో నాగార్జున ఫ్రెండ్ సతీష్ అక్కడ ఉండడం.. సతీష్ నాగార్జున ను కూల్ చేయడం జరిగిందట. పిల్లలు అన్నాక దెబ్బలు తగలవా ఏంటి అంటూ మాట్లాడడంతో నాగార్జున కూల్ అయ్యాడట . జస్ట్ మిస్ లేకపోతే ఆరోజు నాగార్జున వాళ్ళని కొట్టిన కొటేసేవాడట . ఈ విషయాన్ని స్వయానా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం..!!