“వరుణ్-లావణ్యల సినిమా..పరమ చెత్త వేస్ట్”..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఈ జంట పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగానే వైరల్ గా మారింది . వరుణ్ తేజ్ మెగా హీరో .. లావణ్య త్రిపాఠి ఓ అందాల ముద్దుగుమ్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. గుట్టుచప్పుడు కాకుండా ఐదేళ్లకు పైగానే సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ ఆ తర్వాత నిశ్చితార్థంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది . ఇటలీలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది .

అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే వస్తుంది . తాజాగా సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకు సంబంధించిన ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. వరుణ్ లావణ్య త్రిపాఠి కలిసి నటించిన మిస్టర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది హెబ్బా పటేల్ . ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అది ఒక వేస్ట్ సినిమా అనే విధంగా కామెంట్స్ చేసింది .

దీనితో అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. రీసెంట్గా ఇంటర్వ్యూలో దానిపై క్లారిటీ ఇచ్చింది హెబ్బా పటేల్ . గతంలో ఆమె మాట్లాడిన మాటల విషయాలను మరొకసారి హోస్ట్ ప్రశ్నిస్తూ ..మీ వల్లే సినిమా ఫ్లాప్ అయిందేమో అన్న రేంజ్ లో మాట్లాడారు కదా..? దానిపై మీ స్పందన ఏంటి..?” అని అడగ్గా ..”అది అప్పట్లో జరిగింది.. ఆ వ్యాఖ్యలకు నేను సారీ కూడా చెప్పాను మళ్లీ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు వదిలేయండి “అంటూ చెప్పుకొచ్చింది . దీంతో హెబ్బా పటేల్ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట బాగా వైరల్ గా మారాయి..!!