“వాళ్లంత ఎర్ర తోలు హీరోయిన్లు”..మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మోహన్ బాబు .. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . నిజంగా మోహన్ బాబు లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం చాలా చాలా రేర్. ముక్కు సూటు మనిషి .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు .. అవతల వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తప్పు చేస్తే తాట తీసేస్తారు .. ఆయన డెడికేషన్ క్రమశిక్షణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే . కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

 

మోహన్ బాబు ఏ విషయమైనా స్ట్రైట్ గా చెప్పేస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు . కాగా గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నార్త్ హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేశాడు మోహన్ బాబు. ఆయన మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో ఎర్ర తోలు ఉన్న హీరోయిన్స్ పై హీరోలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.. వాళ్ళు షూటింగ్ కి లేటుగా వచ్చిన సరే ఎందుకు ఆలస్యం అయ్యింది అని నిలదీసే దమ్ము ఒక్కడికి కూడా లేదు.. పైగా నేను అలా అడిగితే నాపై వెటకారంగా జోకులు వేసుకుంటారు.. నవ్వుకుంటారు”..

” ఎవరైనా ఏదైనా హీరోయిన్ మోహన్ బాబుతో నటిస్తున్నాను అని చెప్తే వెంటనే పగలబడి నవ్వుతారు .. ఆ విషయం నాకు తెలుసు. ఇండస్ట్రీ ఇలా బ్రష్టు పట్టుకోవడానికి కారణం మేనేజర్లు.. పర్సనల్ సెక్రటరీస్.. వాళ్లే సగానికి సగం ఇండస్ట్రీని నాశనం చేశారు ..కొన్ని కొన్ని విషయాలలో వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేశారు.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేము అంటుంటాం గా.. మన ఇండస్ట్రీలోనే తప్పులు పెట్టుకొని మనం ఏం చేయగలం “అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో మరొకసారి ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!