ఒక్కే ఒక్క పోస్ట్ తో అందరి నోర్లు మూయించిన బన్నీ.. దట్ ఈజ్ పుష్ప రాజ్..!!

నేడు ఫాదర్స్ డే.. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ సెలబ్రిటీలు.. తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు . అయితే అల్లు అర్జున్ సైతం తన తండ్రి అల్లు అరవింద్ కి సంబంధించిన షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది . ఈ పోస్ట్ సెకండ్స్ లోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ఎలా ఏకిపారేస్తున్నారో జనాలు ,అమం చూస్తూనే ఉన్నాం.

అసలు ఆయన ఇండస్ట్రీ నుంచి బాయ్ కాట్ చేయాలి అన్న కొత్త విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు . పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా మరొక వేరే వ్యక్తికి సపోర్ట్ చేయడమే దిన్నంతటికీ కారణం అంటూ కూడా తెగ ప్రచారం జరిగింది . అయితే మరి కొంత మంది అల్లు అర్జున్ ని నమ్మకద్రోహి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని వాడుకొని.. క్రేజ్ రాగానే ఆ మెగా ఫ్యామిలీ ని వదిలేసాడు అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడారు .

అయితే ఇలాంటివి పెద్దగా పట్టించుకోని అల్లు అర్జున్.. ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్.. నా కుటుంబం నాది.. నా లైఫ్ నాది అన్న రేంజ్ లో తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ విష్ చేశారు . దానికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క పోస్టుతో మెగా ట్రోలర్స్ నోరు మూయించేసాడు బన్నీ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ పోస్ట్ ను ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జరిగే పరిణామాలు చూస్తుంటే ఈ వార్ ఇప్పట్లో ముగిసేలా లేనే లేదు..!!