మరో నాలుగు రోజుల్లో క్లీంకార పుట్టినరోజు..రామ్ చరణ్ ఏం చేశాడో చూడండి..!

మెగాస్టార్ చిరంజీవి కన్నా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్న సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన పేరు క్లింకార. మెగా మనవరాలు .. మెగా ఫ్యామిలీకి ఓ లక్కీ దేవత ..ఆమె వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఎలా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు వింటున్నారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన మనవరాలుని ఓ రేంజ్ లో పొగిడేశారు.

క్లీం కార జూన్ 20వ తేదీ 2023వ సంవత్సరంలో జన్మించింది. కేవలం మరో నాలుగు రోజుల్లోనే మొదటి పుట్టినరోజును జరుపుకోబోతుంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆమె ఫేస్ రివిల్ చేస్తారు అంటూ ఫుల్ జోష్లో ఉన్నారు . అయితే తన కూతురు పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందే అద్దిరిపోయే ఫోటోని రివిల్ చేశాడు రామ్ చరణ్. ఫాదర్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ ఫోటో బయటకు వచ్చింది . ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు .

ఈ ఇంటర్వ్యూ నేడు ఫాదర్స్ డే సందర్భంగా పబ్లిష్ అయింది. ఈ క్రమంలోనే క్లింకాలతో ఉన్న కొన్ని ఫోటో షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్ . ఆ ఫొటోస్ పబ్లిష్ అయ్యాయి . ఈ ఫోటో చాలా చాలా వైరల్ గా మారింది . పూర్తిగా ఆమె ఫేస్ రివిల్ చేయనప్పటికీ సైట్ కట్స్ మాత్రం రివీల్ అయిపోయాయి. అచ్చం రామ్ చరణ్ లాగే ఉంది అంటూ కొందరు అంటుంటే కాదు కాదు కాదు ఉపాసనలా ఉంది అంటూ మరికొందరు అంటున్నారు . మొత్తానికి పుట్టిన రోజుకి నాలుగు రోజుల ముందే అభిమానులకి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చేశాడు రామ్ చరణ్. ప్రజెంట్ రామ్ చరణ్ ..క్లీం కార ఉన్న ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి..!!