ఆ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ నాకు నచ్చలేదు.. మొఖంపై చెప్పేసిన జక్కన్న.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?!

రైటర్ గా డైరెక్టర్ గా సందీప్ రాజా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కధాంశాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సందీప్ రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన కలర్ ఫోటో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుహాస్‌ హీరోగా.. చాందిని చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పేరుకు చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్లతో పాటు.. నేషనల్ అవార్డ్‌ను దక్కించుకొని క్రేజ్ మ‌రింత‌గా పెంచుకుంది. అయితే చాలామంది ఆడియన్స్ కు భీభత్సంగా నచ్చేసిన ఈ సినిమా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి మాత్రం అస్సలు నచ్చలేదట.

Colour Photo Movie (2020) | Release Date, Review, Cast, Trailer, Watch  Online at Aha - Gadgets 360

సినిమాలో కొన్ని పాయింట్లు తనకి నచ్చలేదని రాజమౌళి స్వయంగా సందీప్ తో వివరించాడట. నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత సందీప్ రాజ్‌ ఒకసారి రాజమౌళిని కలిశానని.. అప్పుడు కలర్ ఫోటో సినిమా గురించి ఆయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడంటూ వివరించాడు. రాజమౌళి అసలు సినిమా బాలేదని స్వయంగా నాతోనే చెప్పారు అంటూ చెప్పుకొచ్చాడు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ సినిమాలో నాకు కొన్ని సన్నివేశాలు అసలు నచ్చలేదు అన్నారట. అదేంటి సార్ అని అడిగితే నువ్వు చాలా కన్వెన్షన్‌తో సినిమా తెర‌కెక్కించావు.. అన్నార‌ని చెప్పుకొచ్చాడు.

కలర్ ఫొటో' డైరెక్టర్ తో చేసే స్టార్ హీరో ఎవరబ్బా?

కాగా నేను క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యా.. కనుక ఈ విషయాలు చెప్తున్నా లేకపోతే ఏదో తీశారు వచ్చింది అని వదిలేస్తా.. నాకు సినిమా నచ్చింది కానీ లాస్ట్ లో బాగా డిసప్పాయింట్ చేసావ్.. హీరో చనిపోవడం నాకు అసలు నచ్చలేదంటూ ఆయన వివరించాడు. నెక్స్ట్ సినిమా నుంచి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకో.. ఒక చావుతో కథ మొదలవ్వాలి కానీ ఏండ్ కాకూడదు హీరో డెత్ ఎప్పుడు అంటే మరొకచోట మంచి జరుగుతుంది అంటేనే జరగాలి.. అప్పుడే హీరో చనిపోయిన సినిమాలో అర్థం ఉంటుంది. నాకు అదే భగవద్గీత అంటూ రాజమౌళి తనకు చెప్పాడని.. ఆయన చెప్పిన మాటలు నన్ను బాగా ఇన్‌ఫ్లూయ‌న్స్‌ చేశాయంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రాజా.