రవిబాబు, విజయ్ దేవరకొండ కాంబోలో ఓ హారర్ థ్రిల్లర్ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఎన్నో రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్‌ సినిమాలలో ఆకట్టుకుంటున్నాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా లాంటి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్లతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇన్నాళ్లు ప్రేమ కథ సినిమాలతో ఆకట్టుకున్న ఈ రౌడీ స్టార్.. ఓ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ అయ్యాడు అంటూ తెలుస్తుంది. డైరెక్టర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు డైరెక్షన్‌లో అవును సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Harshvardhan Rane - Some good news :) Avunu Part 2 on April 3rd ! | Facebook

అయితే ఈ సినిమాలో మొదటి విజయ్ దేవరకొండ నటించాల్సిందట. కానీ కొన్ని కారణాలతో సినిమా మిస్ అయిందని తెలుస్తుంది. ఇంతకీ దానికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన రవిబాబు.. ఇందులో విజయ్ దేవరకొండ మీ విషయంలో హర్ట్ అయ్యారట కదా అంటూ విలేఖరి నుంచి ఎదురైన ప్ర‌శ్న‌కు రియాక్ట్ అయ్యాడు. రవిబాబు మాట్లాడుతూ విజయ్ హర్ట్ అయ్యాడు అన్న విషయం కూడా నాకు తెలియదు. నాతో ఆయన ఎప్పుడు అనలేదు. నా డైరెక్షన్‌లో విజయ్ నువ్విలా సినిమాలో నటించాడు. నాకు తెలిసి ఓ వ్యక్తి అతడిని నాకు పరిచయం చేశాడు.

Ravi Babu Phone Number, House Address, Email ID, Contact Details | Actor  bio, Actors, Biography

నేను అనుకున్న ఓ పాత్రకు అతను అయితే బాగుంటుందని అనిపించింది. తర్వాత మేము కలిసి మూడు యాడ్ ఫిలిమ్స్ లో నటించాం.. ఇక నేను చేసిన అవును సినిమా హీరో పాత్రకు విజయ్ బాగుంటాడని భావించాం. కానీ ఆ టైంకి విజ‌య్‌ అందుబాటులో లేకపోవడంతో హర్షవర్ధన్ రానేను తీసుకొని సినిమాను తెరకెక్కించాం. విజయ్‌తో టచ్ లోనే ఉన్న ఫ్యామిలీ స్టార్ లో విజయ్ తో కలిసి నటించా అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవిబాబు చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో అవను లాంటి హారర్ థ్రిల్లర్ ను విజయ దేవరకొండ మిస్ చేసుకున్నాడా అంటూ అంతా షాక్ అవుతున్నారు.