ఓ సినిమాకు ఫిక్స్ అయ్యారంటే దానికోసం తమను తాము ఎంతలా మార్చుకోవడానికైనా సిద్ధమవుతూ ఉంటారు చాలామంది టాలీవుడ్ స్టార్స్. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిక్స్ ప్యాక్ పెంచడం నుంచి ఫ్యామిలీ ప్యాక్‌గా మార్చుకోవడం వరకు దేనికైనా సిద్ధమంటారు. ముసలి వారిగా కూడా కొన్నిసార్లు సినిమా కోసం తమ గెటప్ ను మార్చేసుకుంటారు. అయితే ఈ పై ఫోటోలో ఉన్న హీరో కూడా సరిగ్గా ఈ లిస్టులోకి వస్తాడు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటించే ఈ హీరో ఇప్పుడు కూడా గుర్తుపట్టకుండా ముసలివాడిలా మారిపోయి నటించడానికి సిద్ధమయ్యాడు.
ఇంతకీ ఈ టాలెంటెడ్ హీరో ఎవరో అనుకుంటున్నారా.. గుర్తుపట్టడం కాస్త కష్టమే లెండి.. అతను మరెవరో కాదు తాజాగా ఓం భీమ్ బూష్ తో ఆడియన్స్‌ను భయపెట్టిన శ్రీ విష్ణు. ఇప్పుడు స్వాగ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. హసిత్ గోలి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ విష్ణు.. భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో అతని మేకోవర్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.
ఎందుకంటే శ్రీ విష్ణు ముసలివాడిలా కనిపిస్తున్నాడు.. ఇంతే కాదు శ్రీ విష్ణు ఇంకా బోలెడు గెటప్పుల్లో ఆకట్టుకోనున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. స్వాగ్‌లో రీతు వర్మ హీరోయిన్గా నటించనుంది. అలాగే సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకోనుంది. దక్షినగార్కర్ స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ చూస్తే పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా స్వాగ్ రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.