ఆ రోజే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్ కావాలంటూ అభిమానుల డిమాండ్.. చరణ్ వాళ్ళ కోరిక తీరుస్తాడా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు వారాలు ప్రీపోన్ కావడం అభిమానుల‌కు ఆనందాన్ని కలిగించింది. ఓజీ వాయిదా పడడంతో దేవరను రీప్లేస్ చేస్తూ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. స్టూడెంట్ నెంబర్ 1 డేట్ కి ఈ సినిమా రిలీజ్ కానుండడంతో అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 10న గేమ్ చేంజర్ విడుదలయితే బాగుంటుందని చ‌ర‌ణ్ అభిమానులు భావిస్తున్నారు. గేమ్ చేంజర్‌ సినిమాకు ఆ తేదీ పర్ఫెక్ట్ డేట్ అని వారి అభిప్రాయం. అయితే ఆ సమయానికి గేమ్ చేంజ‌ర్ షూటింగ్‌ను మేక‌ర్స్ పూర్తి చేస్తారో లేదో వేచి చూడాలి.

TirupatiNTRFans | Gattiga Ichestham Sep27💥🤙✊ @jrntr @devaramovie . .  #ntrramarao #ntr #ntrfc #ntr30 #ntr31 #ntrfansclub #ntrjr  #ntrdiehardfans... | Instagram

సినిమా రిలీజ్ గురించి మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన జరగండి జరగండి సాంగ్‌కు మాత్రం ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. గేమ్ చేంజ‌ర్ సినిమా షూటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో థియేటర్లలో విడుదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతున్నా చరణ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ రాకపోవడం.. గేమ్ చేంజర్ కారణంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిగతా సినిమాల షూటింగ్ కూడా ఇప్పటివరకు మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ అంత చరణ్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Game Changer (film) - Wikipedia

అయితే గేమ్ చేంజర్‌కు సంబంధించిన క్లారిటీ చరణ్ నుంచి కూడా ఏది రావడం లేదు. ఇంకా సినిమా ఆలస్యమైతే దీనిపై ప్రేక్షకులు హైప్‌ కూడా త‌గ్గే ప్ర‌మాదం ఉంది. కాగా రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. కెరీర్ పరంగా విజయాలు అందుకోవాలని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టు పై చొరవ తీసుకొని త్వరగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక చరణ్ రెమ్యూనరేషన్ పరంగా టాప్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసింది.