టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి హీరో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన డ్యాన్సులతో, ఫైటులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తాడు కూడా. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పుష్పా తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్న బన్నీ.. పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా ఆగస్టు 15న వచ్చే అవకాశం లేదని సమాచారం.
ఎందుకంటే సినిమాకు సంబంధించిని షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా నిదానంగా జరుగుతున్న క్రమంలో సినిమా పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రావడంతో ఇక పుష్ప 2.. ఆగస్టు 15న రానట్టే అంటూ సినీ ఇండస్ట్రీలో మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి రామ్ భారీ క్రేజ్‌ను సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే పూరి జగన్నాథ్ తో పాటు రామ్ కి కూడా మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. వారి కెరీర్‌కు మంచి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక సినిమాతో భారీ సక్సెస్ కొట్టి వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న పూరి జగన్నాథ్.. ఈ సినిమా సక్సెస్ అయితే పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.