డిప్యూటీ సీఎం గా పవన్ ప్రమా స్వీకారం పై నటుడు అజయ్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్..?!

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస‌ అవకాశలు అందుకుంటున్నాడు అజయ్ ఘోష్‌. ఆయనకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెండితెరపై విలన్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఎలాంటి పాత్రనైనా తనదైన నటనతో ఆకట్టుకునే అజయ్ ఘోష్‌ నటుడు గానే కాదు.. సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఏ విషయమైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టి వైరల్ అవుతూ ఉంటాడు. తాజాగా అజయ్.. పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ లో సక్సెస్ సాధించడం పై రియాక్ట్ అయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి ఈవెంట్లో పాల్గొని సందడి చేశాడు. ఇందులో చాందిని చౌదరి మరో ప్రధాన పాత్రలో నటించింది.

Pushpa' fame Ajay Ghosh, 'Colour Photo' heroine in 'Music Shop Murthy'

తాజాగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఇటీవ‌ల‌ ఈ సినిమా టీం ప్రమోషన్స్ లో సందడి చేశారు. ఈ క్రమంలో జరిగిన ప్రెస్మీట్లో అజయ్ ఘోష్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయడంపై ప్రశ్న సంధించారు విలేకరులు. దీనికి ఆయన ఆసక్తికరమైన రీతిలో రియాక్ట్ అయ్యాడు. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ గారు ఇండస్ట్రీకి ఏ విధంగా సహాయపడతారు అని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. నేనేమనుకుంటాను నాకు అర్థం కావట్లేదు.. ఆయన అందరికీ మంచి చేస్తారు.. ప్రజలకు ఇండస్ట్రీకి అందరికీ ఆయన మంచి చేస్తాడు. నువ్వు అధైర్య పడాల్సిన పనిలేదు అంటూ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అన్ని బ‌య‌ట‌ పెట్టేస్తా అంటూ అజయ్ ఘోష్‌కు బెదిరింపులు.. లీకైన ఆడియో  నెట్టింట హల్‌చల్

పవన్ ఎపి ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయభేరీ మోగించాడు. వైసీపీ అభ్యర్థి వంగా గీతా పై.. 70000 మెజారిటీతో సక్సెస్ అందుకున్నాడు. ఈ గెలుపును మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ గ్రాండ్ లెవెల్ లో సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఆయన గెలుపు పై ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక డిప్యూటీ సీఎం గా పగ్గాలు పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎలాంటి మార్పులు తీసుకొస్తారు.. ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు.. అనే ఆసక్తి జనాల్లో మొదలైంది. మరి రాష్ట్ర ప్రజలు, సినీ పరిశ్రమ కోసం.. పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆయన విజన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.