క్లైమేట్ మారిపోతుంది.. ఎప్పుడు ఎండ వస్తుంది.. ఎప్పుడు వర్షం పడుతుంది .. అనే విషయం అస్సలు అర్థం కావడం లేదు. పగలంతా ఎండ కాస్తు సాయంత్రం కి జల్లులు పడుతున్నాయి . ఇలాంటి క్లైమేట్ లోనే చిన్నపిల్లలకి తరచూగా జలుబు – దగ్గు – కడుపు నొప్పులు వస్తూ ఉంటాయి . మరి ముఖ్యంగా బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం .. నేటి కాలం పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే చాలామంది కడుపునొప్పి అంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు .
కొందరు పిల్లలు మరీ ఎక్కువగా కడుపునొప్పి కడుపునొప్పి అంటూ ఏడుస్తూ ఉంటారు . అది ఫుడ్ ప్రాబ్లం కారణంగా కావచ్చు.. మరి ఏ ఇతర కారణాలైనా కావచ్చు.. పిల్లలు అలా కడుపునొప్పి అంటున్నప్పుడు వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం చాలా చాలా ఉత్తమంటున్నారు మన పెద్దలు. కొంచెం వాము ..జీలకర్ర ను వేడి నీళ్లలో మరిగించి చిన్న స్పూన్ తో పిల్లలకు ఫిల్టర్ చేసి తాపిస్తే.. పొట్టలో గ్యాస్ ఉన్న లేకపోతే అజీర్ణ సమస్యలు ఉన్న వెంటనే తగ్గిపోతాయట .
తద్వారా పిల్లలకి కడుపునొప్పి కూడా తగ్గుతుందట. కడుపునొప్పి ఉన్నప్పుడే ఇలా చేయాలి అన్న రూల్ లేదు.. కనీసం వారానికి ఒకసారి లేదా రెండు వారాలకి ఒక్కసారి చేసిన కూడా పిల్లలు కడుపు బాగా క్లీన్ అవుతుందట. మోషన్ ఫ్రీగా వెళ్లిపోతారట . ఈ వంటింటి చిట్కాలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్లు తరచూ కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లంస్ కి దూరం గా ఉండచ్చు అంటున్నారు మన పెద్దవాళ్లు..!!