మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి కొన్ని కొన్ని సాంప్రదాయాలను వదిలేస్తున్నారు కొందరు లేడీస్. మరీ ముఖ్యంగా సిటీస్ లో ఉండేవాళ్లు తెలుగు సాంప్రదాయాలను పూర్తిగా వదిలేస్తున్నారు. తెల్లవారుజామునే లేవడం ..ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టడం .. పేడ నీళ్లతో కల్లాపు చల్లడం లాంటివి.. అసలుకే మర్చిపోయారు . కాగా మరికొన్ని అతి ముఖ్యమైన నియమాలను సైతం పాటించకుండా వచ్చేస్తున్నారు నేటి కాలం లేడీస్ ..
ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా మారింది . చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు . మన పెద్దలు మనకు ఎన్నెన్నో మంచి మంచి పద్ధతులు అలవాటు చేస్తూ ఉంటారు. మంచి విషయాలను కూడా చెప్తూ ఉంటారు. కాగా ఇప్పుడు అదే న్యూస్ మరొకసారి వైరల్ గా మారింది . పెళ్లయిన ఆడవాళ్లు .. ముత్తైదువులు తలలో మల్లెపూలు పెట్టుకొని చాటలో బియ్యం చెరగకూడదు .. మల్లెపూలు మాత్రమే కాదు ఏ పూలు పెట్టుకుని కూడా చాటలో బియ్యం లో రాళ్లను ఏరకూడదు ..
ఇది చాలా తక్కువ మందికే తెలుసు . మన పురాణాలు చెబుతున్న ప్రకారం .. ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకొని చాటలో బియ్యం లోని రాళ్లు చూడకూడదట. అంతేకాదు ఏదైనా చావు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడవాళ్లు తలలో పూలు పెట్టుకొని వెళ్ళకూడదు . ఈ నియమాలు చాలామంది నేటి కాలంలో పాటించడం లేదు. కొంత మందికి తెలిసిన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు.. కొందరు తెలియక తప్పు చేస్తున్నారు.. దీంతో మరొకసారి పెద్దలు ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు..!!