రామోజీరావు కెరీర్ లో నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?!

ప్రముఖ స్టార్ రామోజీరావు 83 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. 1936 నవంబర్ 16 ఆంధ్ర ప్రదేశ్ , కృష్ణా జిల్లాలో..పెదపారుపూడిలో జన్మించిన వ్యాపారవేత్తగా, మీడియా ఎంటర్ ప్రిన్యూర్ గా, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్గా, సినీ ప్రొడ్యూసర్ గా, ఫిలిం సిటీ హెడ్గా.. ఇలా రియల్ లైఫ్ లో మల్టీ టాస్క్ లతో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రామోజీరావు అంటే అందరికీ టక్కన గుర్తుకు వచ్చేది రామోజీ ఫిలిం సిటీ. కొండల్లో ఆయన అద్భుతమైన ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. ఇక రామోజీరావు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బంధువు చిత్రంలో రామోజీరావు కనిపించిన సినిమా ఏంటో తెలుసా..

ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి లాభాలను అందుకున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ సినిమాలను కూడా నిర్మించాడు. వీటిలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి.. సమాజానికి ఉపయోగపడే సినిమాల వరకు అన్ని ఉన్నాయి. అయితే నిర్మాత గానే కాకుండా.. నటుడిగాను ఓ సినిమాలో కనిపించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. సినిమాలంటే ఇష్టంతో రామోజీరావు ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. 1978లో యు. విశ్వేశ్వరరావు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మార్పు సినిమాల్లో జడ్జ్ రోల్ ప్లే చేశాడు.

Ramoji Rao, Never Done Business Only For Profits

ఆయన కేవలం గెస్ట్ రోల్ లోనే నటించినా.. సినిమా పోస్టర్లపై రామోజీరావు బొమ్మను ప్రచురించడం విశేషం. ఇక ప్రస్తుతం రామోజీరావు నటించిన ఈ సినిమాకు సంబంధించిన పిక్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. వీటితో పాటే రామోజీరావు.. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ నెట్వర్క్, టీవీ ఛానల్, ఈనాడు జర్నలిజెన్సీ స్కూల్, సితార, విపుల, చతుర మ్యాగజైన్లను.. ఉషా కిరణ్ మూవీస్ సినిమా ప్రొడక్షన్, అలాగే మార్గదర్శి చిట్టి ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పచ్చళ్ళు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు.