16 ఎళ్ళకే హీరోయిన్.. పెళ్లితో సినిమాలకు చెక్.. రూ. 1300 కోట్ల అధిపతి ఎవరో గుర్తుపట్టారా.. ?!

పై ఫోటోలో ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నది ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్. తెలుగు తో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్గా మెరిసింది. కోట్ల ఆస్తిని సంపాదించి కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ సమయంలోనే ఆమె చేసిన తక్కువ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదు.. కేరళ సోయగం ఆసిన్. మొదట మోడల్ గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. 16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

Asin - Wikipedia

2001లో నరేంద్ర మొక్కను జయకాంతన్ వగమకాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో రవితేజకు జంటగా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్‌ దక్కించుకున్న ఆసిన్ టాలీవుడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకుంది. నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో మెప్పించింది. పలు హిట్ సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ్‌లో విజయ్‌, అజిత్, సూర్య, కమలహాసన్, విక్రమ్ సరసన నటించి ఆకట్టుకుంది.

Asin Tottumkal Gives A Sneak-Peek Into Her Daughter, Arin's PlayDate, The  Little One Exudes Pure

అంతేకాదు బాలీవుడ్‌లోను.. బడా హీరోలతో జంట కట్టింది. అమీర్ ఖాన్‌, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ లాంటి నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని బాగా పాపులారిటీ దక్కించుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న టైంలో వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న అసిన్.. సినిమాలకు దూరమైంది. 2016లో మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఇతను సల్మాన్ ఖాన్ కు మంచి స్నేహితుడు కావడం విశేషం. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అసిన్‌కు ప్రస్తుతం అరీన అనే ఆరేళ్ల పాప ఉంది. ఇక ప్రస్తుతం ఆసిన్ ఆస్తి విలువ రూ.1300 కోట్ల పైచిలుకే అని సమాచారం.