రామోజీరావుకు అలాంటి కోరిక ఉందా.. ఆయ్య‌యో ఆ కోరిక తీరకుండా చనిపోయారేే..?!

మీడియా మొగ్గల్‌ రామోజీరావు నిన్న‌(8 జూన్‌)న‌ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త సినీ రాజకీయ వర్గాల్లో సంచలనగా మారింది. ఎంతోమందిని కలచివేసింది. ఇప్పటికే ఎంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావుకు సోష‌ల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే. ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందంటూ.. ఎవ్వరికి తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ ఎంతో మంది ఎమోషనల్ పోస్టల్ షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే రామోజీరావును ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఎన్నో సినిమాలను నిర్మించి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌లు అందుకున్నాడు.

Usha Kiran Movies Ready To produce Small Movies

జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ ఇలా ఎంతో మందిని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. అయితే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై 100 సినిమాలను నిర్మించాలని రామోజీరావు కోరుకునే వారట. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రామోజీరావు ఎక్కువగా పరిమిత బడ్జెట్ తో సినిమాలను నిర్మించి మంచి లాభాలను గడిస్తూ వచ్చాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ఎంతోమంది సినీ కెరీర్‌కు తన వంతు సహాయం అందించాడు.

Ramoji Film City Founder Ramoji Rao Passes Away In Hyderabad

ఇక నేడు రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అధికారలాంచ‌నాల‌తో రామోజీరావు అంత్యక్రియలు ఘనంగా జరగనున్నాయి. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించడంతోపాటు.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎంతోమంది మీడియాతో వెల్లడించారు. జర్నలిజం రంగంతో పాటు సినిమాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న ఈయన.. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన లాంటి సంచలన విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈయ‌న తెరకెక్కించిన సినిమాల్లో స్త్రీ పాత్రలకు మంచి బలం ఉంటుందన్న చాలా మందికి చెబుతూ ఉంటారు.