కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్.. స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. లతా అనే అమ్మడును పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రజినీ.. గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి. శ్రీదేవిని రజినీకాంత్ ఒకప్పుడు చాలా ప్రేమించారట. 1976లో తమిళ భాషల్లో కే. బాలచంద్ర డైరెక్షన్‌లో వచ్చిన ఓ సినిమాలో శ్రీదేవి, రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ టైంలో రజిని, శ్రీదేవి మధ్య మంచి స్నేహ ఏర్పడిందని.. అయితే రజిని ఆమెతో ప్రేమలో పడ్డారని తెలుస్తుంది.
రజనీకాంత్, శ్రీదేవి స్నేజ్ఞ బంధం చాలా నాళ్ళు చెక్కుచెదరలేదట. శ్రీదేవి తల్లిని కూడా రజనీకాంత్ తన సొంత వ్యక్తిగా గౌరవించేవాడు. సినీ పరిశ్రమలో ఇద్దరు కలిసి ఉండటంతో రజిని, శ్రీదేవికి మంచి సన్నిహిత్యం కుదిరింది. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న సమయంలో రజిని చాలాసార్లు తన ప్రేమను శ్రీదేవికి వ్యక్తం చేశారట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని రజిని తల్లి ఆయన్ని కోరిందట. శ్రీదేవికి రజినీకాంత్ పట్ల అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకపోవడంతో.. ఇది జరగలేదని ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కే బాలచంద్ర వివరించాడు. రజినీకాంత్ స్వయంగా శ్రీదేవి ఇంటికి వెళ్లి తన ప్రేమ చెప్పాలనుకున్నాడట. శ్రీదేవి గృహప్రవేశ వేడుకకు రజిని, నేను వెళ్ళాం. మేము అతని ఇంటికి చేరగానే కరెంటు పోయింది.
ఇల్లు అంతా చీకటిగా ఉండడంతో చెడు సకునంగా భావించిన రజినీకాంత్ ఒక మాట కూడా పెళ్లి గురించి చెప్పకుండా నిరాశతో వెను తిరిగాడు అంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోకపోయినా శ్రీదేవి అంటే అమితమైన గౌరవం ఉందని.. ఆమె చనిపోయేంతవరకు వీరిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారిని చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ పర్సనల్ నెంబర్ ను కొద్ది మందికి మాత్రమే ఇస్తాడు. ఇందులో దర్శకుడు కే బాలచందర్, నటుడు కమలహాసన్, శ్రీదేవిలు ఉన్నారు. రానా మూవీ షూట్ టైంలో రజనీకాంత్ కోసం ఉపవాసం కూడా చేశారట. అంతలా వీరిద్దరి మధ్యన బాండింగ్ ఉండేదని.. అలా శ్రీదేవి మరణించినప్పుడు రజనీకాంత్ తన్న పెళ్లిరోజు కూడా జరుపుకోలేదని తెలుస్తుంది.