ఆ స్టార్ హీరోల ఇంటి పక్కనే కొత్త బంగ్లా కొన్న యానిమల్ బ్యూటీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో నేషనల్ క్ర‌ష్‌గా మారిపోయింది స్టార్ బ్యూటీ త్రిప్తి. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన అ ముద్దుగుమ్మ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంది. కానీ యానిమల్‌తో ఒక్కసారిగా ఈ అమ్మ‌డి పేరు మారుమోగిపోయింది. సినిమాలో రణ్‌బీర్, రష్మిక హీరో హీరోయిన్‌లుగా నటించగా.. తృప్తి కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల కంటే ఈ అమ్మడికి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు హిందీలో తృప్తికి వరుస ఆఫర్లు క్యూ కట్టడంతో పాటు.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

Animal Beauty Tripti Dimri's First Wrong Step?

తెలుగులోను భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కు ఈ అమ్మడు అవకాశాన్ని దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే ఫుల్ జోష్ లో ఉన్న ఈ అమ్మడు.. ఇటీవల ముంబైలో ఆస్తులు కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈమె బాగా ఫాలో అవుతుందట. ప్రస్తుతం ప‌లు సినిమాలతో బిజీగా ఉన్నతి ముంబైలో స్టార్ సెలబ్రిటీలు ఉండే బాంద్రా ఏరియాకు తన మకం చేంజ్ చేసిందని తెలుస్తుంది.

2689 sq-ft Mixed Roof House Rendering

రణ్‌బీర్ కపూర్‌, ఆలియా భ‌ట్, సల్మాన్, షారుక్ లాంటి స్టార్ హీరోలు నివసించే బాంద్రా ఏరియాలోని రెండు అంతస్తుల బంగ్లాను కొనుగోలు చేసిందని తెలుస్తుంది. సుమారు 257 గజాలు విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు దాదాపు రూ.14 కోట్ల వరకు ఉంటుందట. ఇప్పటికే స్టాప్ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్‌కు రూ. 30 లక్షలు ఇచ్చిందట. ఇప్పుడు ఈ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కోట్ట‌డంతో అంత ఆశ్చర్యపోతున్నారు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టినయి అమ్మడు.. మామ్ పోస్టర్, బాయ్స్, లైలా మజ్ను లాంటి సినిమాలో తాకట్టుకుంది. కానీ బుల్బుల్ సినిమాతో ఫేమస్ అయినా త్రిప్తి అనిమల్ తో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్‌ని దక్కించుకుంది.