టాలీవుడ్ లో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్. మొదటి సీతారామమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో తన అందం, అభినయంతో.. అచ్చ తెలుగు ఆడపడుచుల మెప్పించింది. తన సంప్రదాయం, మాట తీరు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మృణాల్.. తర్వాత నేచురల్ స్టార్ నాని సినిమాలో నటించి మెపించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించినా.. ఆ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు.
అయినా మృణాల్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇటీవల అమ్మడు ఓ క్రేజీ మూవీ ఆఫర్ దక్కించుకుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. రాఘవ లారెన్స్ హారర్ కాన్సెప్ట్‌తో 2007లో తెరకెక్కించిన మూవీ కాంచన. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి సినిమాకు సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన కాంచన, గంగ, కాంచన 3 సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సీరిస్‌లలో వచ్చిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఇప్పటిదాకా సేక్వల్ గా కాంచన 4 తెరకెక్కించే పనులో బిజీగా ఉన్నాడు లారెన్స్. సెప్టెంబర్ నుంచి సినిమా సెట్స్ పైకి రానుందట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్ గా మారింది. బ్లాక్ బస్టర్ సీక్వెల్లో హీరోయిన్ గా మీణాల్ నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. అంతా షాక్ అవుతున్నారు. మొదటి హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడం.. అలాగే సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి.