యంగ్ బ్యూటీ అదా శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది.. అదాశర్మ నుంచి రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో భారీ పాపులర్ దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సినిమా తర్వాత బస్తల్ ది నక్సల్ స్టోరీ సినిమాతో సక్సెస్ అందుకుంది. దీంతో వరుస ఆఫర్లు మొదలయ్యాయి. రెండు వైవిధ్యమైన కథలను ఎంచుకున్న నటించిన ఈ అమ్మడు ఒక్కసారిగా రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంది.
ఇక ప్రస్తుతం బార్ సినిమాల్లో డ్యాన్సర్‌గా ఈ అమ్మడు మెప్పించనుంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా తనకు అరుదైన వ్యాధి ఉంది అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సమస్య కూడా సినిమాల వల్ల ఏర్పడిందని చెప్పుకొచ్చింది. కేరళ స్టోరీ మూవీలో ఓ కాలేజ్ అమ్మాయిల కనిపించాలని ఎంతగానో శ్రమించానని.. బరువు తగ్గాల్సి వచ్చింది అంటూ వివరించింది. తర్వాత భస్తర్ ది నక్సల్ స్టోరీ కోసం శరీరాన్ని మరింత బరువు పెంచాల్సి వచ్చింది.. బరువైన గన్‌లు మోయాలి.. అలాగే దానిని బ్యాలెన్స్ చేసే విధంగా శరీరం కనిపించాలి దీంతో బలంగా ఉండడానికి 10 నుంచి 12 వరకు అరటిపండు తినేదాన్ని అంటూ అమ్మడు వివరించింది.
అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లెక్స్ సీడ్స్ ఉన్న లడ్డులను నాతోపాటు క్యారీ చేసేదాన్ని. నిద్రపోయే గంట ముందు రెండు లడ్డులు తినే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు బార్ సినిమా కోసం మళ్ళీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో శరీరంలో మార్పు రావడంతో అనారోగ్యానికి గురయ్యా. ఎండోమెట్రియోసిస్ వ్యాధి బారిన పడాల్సి వచ్చింది. దీనివల్ల పీరియడ్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతాయని.. దీంతో దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో ఎంతో ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదా చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. ఇంత శ్రమించి ఆరోగ్యమే రిస్క్ చేసి మరి ఇలాంటి డైట్లు ఫాలో అవ్వడం అవసరమా అంటూ.. తరచూ శరీర మార్పులు కాకుండా మీకు సెట్ అయ్యే సినిమాలను ఎంచుకో అదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.