ఆహ‌రంలో ఈ చిన్న‌మార్పుల‌తో షుగ‌ర్‌కు ఇటే చెక్ పెటవ‌చ్చ‌ని తెలుసా..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చిన్న పెద్ద అంటూ వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన‌ పడి ఎంతోమంది సతమతమౌతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య జన్యుపరంగానే కాదు.. కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల‌ కూడా తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పుల వల్ల.. సరైన పౌష్టికాహారం, మెడిసిన్ రోజు వాడడం వల్ల షుగర్ ని ఇట్టే కంట్రోల్ చేయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కూడా డయాబెటిస్ కు మంచి ఫలితాలు ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు పీచు పదార్థం, ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కచ్చితంగా పాటించాల్సిన కొన్ని ఆరోగ్య నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం. డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న వారు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

10 high protein foods | Good Food

ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి.. మనం మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలు కాకుండా.. చిక్కుడు, తాజా కూరగాయలు తినడం వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిది. దీంత‌ షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి కంట్రోల్ చేయడానికి.. జీవనా వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం ఆకలి వేయకుండా చేసి చిరుతిళ్ళపై కోరికను నియంత్రిస్తుంది. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, చేపలు, పన్నీర్ లాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయకుండా శరీర బరువు తగ్గడానికి, ఇన్ఫ్ల‌మేష‌న్ గుణాలను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కర స్థాయి హ‌ఠాతుగా పెరగకుండా ఉండడానికి తోడ్పడుతుంది.

Dry Fruits & Nuts at best price in Mumbai by Kalpak Export | ID: 7772530591

డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలు, అవకాడో లాంటి పదార్థాలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన కొవ్వులను శరీరానికి అందించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి.. గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది. అలాగే రోజు సమయానికి ఆహారం తీసుకోవడం కూడా డయాబెటిస్ పేషెంట్లకు చాలా ముఖ్యం. తినడం లేట్ అయ్యే కొద్ది బ్లడ్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. బ్లడ్ లెవెల్స్ స్తిరంగా ఉంచడానికి పోషిక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సమయానికి ఆహారాన్ని శరీరానికి అందించాలి. మన లైఫ్ స్టైల్ లో చేంజ‌స్ చేసుకోవడం వల్ల డయాబెటిస్, ఊబ‌కాయం లాంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అలాగే ఈ స‌మ‌స్య‌లు రాకుండా ఆపవచ్చు.