ఫోర్బ్స్ టాప్ -10 రిచ్ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్న ర‌జినీ, బన్నీ, ప్రభాస్.. ఎన్నో స్థానం అంటే..?!

ప్రపంచవ్యాప్తంగా సర్వేలు నిర్వహించిన ఫోర్బ్స్ తాజాగా టాప్ 10 రిచ్ యాక్టర్స్ జాబితాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ లిస్టులో భారత దేశంలోనే అత్యంత సంపన్న యాక్టర్ గా షారుఖ్ ఖాన్ పేరు మొదటి నిలిచింది. షారుక్ ఖాన్ ఏకంగా రూ.6300 కోట్ల ఆస్తిని సంపాదించి దేశంలోనే రిచెస్ట్ యాక్టర్ గా మారిపోయారు. అంతేకాదు అత్యధిక రెమ్య‌న‌రేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలోను ఆయనదే మొదటి స్థానం. షారుక్ తో పాటు రజనీకాంత్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, ప్రభాస్, కమల్ హాసన్ తదితరులు దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలుగా.. ఫోర్బ్స్‌ రిచెస్ట్ యాక్టర్స్ 2024 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Can salman Shahrukh and aamir Bollywood three khans seen together in a film  | Bollywood Three Khans: क्या कभी एक साथ एक फिल्म में नज़र आएंगे सलमान,  शाहरुख और आमिर खान? किंग

భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు బాలీవుడ్‌దే పై చేయిగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ప్రపంచదృష్టిని ఆకట్టుకుంటున్నాయి. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్, పుష్ప, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు టాలీవుడ్ రేంజ్‌ను మరింతగా పెంచేసాయి. ఇక షారుక్ నుంచి వచ్చిన జవాన్, పఠాన్ సినిమాలో ఒకే ఏడదిలో 2000 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఢంకీ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి టాక్ వచ్చింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ఎప్పుడు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది.

After Thala Ajith, Akshay Kumar targets Thalapathy Vijay! - Tamil News -  IndiaGlitz.com

ఇక ఈ లిస్టులో సల్మాన్ ఖాన్ రెండో స్థానాన్ని సంపాదించుకున్నాడు. రూ.2, 900 కోట్లు ఆస్తిని కూడబెట్టి రికార్డ్ సృష్టించాడు. ఇక రూ.2500 కోట్ల అధిపతిగా అక్షయ్ కుమార్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. రూ.అమీర్ ఖాన్ 1,862 కోట్ల ఆస్తితో నాలుగో స్థానాన్ని.. జోసఫ్ విజయ్ రూ.474 కోట్లతో ఐదవ స్థానంను ద‌క్కించుకున్నారు. ఇక ఆరో స్థానంలో రజనీకాంత్ రూ.430 కోట్ల ఆస్తిని సంపాదించి, అల్లు అర్జున్ రూ.350 కోట్లతో, ప్రభాస్ రూ.241 కోట్లతో 7,8 స్థానాలను దక్కించుకున్నారు. అజిత్ కుమార్ రూ.196 కోట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇలా ఫోర్బ్స్ అందించిన జాబితా ప్రకారం రజనీకాంత్, అల్లుఅర్జున్, ప్రభాస్ 6, 7, 8 స్థానాలను దక్కించుకొని టాప్ టెన్ రిచెస్ట్ యాక్ట‌ర్స్ లిస్ట్‌లో భాగం అయ్యారు.