తనకంటే చిన్నవాడితో ప్రభాస్ బ్యూటీ ప్రేమాయణం.. అఫీషియల్ గా కన్ఫామ్ చేసిన స్టార్ హీరోయిన్..?!

బాలీవుడ్‌ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో శ్రద్ధ కపూర్ ఒకరు. హిందీలో అనేక సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ అమ్మ‌డు గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా షూటింగ్ టైం నుంచి రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రాహుల్‌మోదీ తో.. ఈ అమ్మడి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Shraddha Kapoor's cute note for rumoured boyfriend Rahul Mody - India Today

వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరు అవ్వడం.. తర్వాత రాహుల్ శ్రద్ధ కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు ఈవెంట్లకు కూడా కలిసి వచ్చి సందడి చేయడం.. అలాగే అనంత్ అంబాని, రాధిక మర్చంట్‌ సెలబ్రేషన్స్ లోనూ కలిసి కనిపించడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇటీవల ఆమె ఇన్స్టాలో ఆర్ అనే అక్షరం ఉన్న లాకెట్ వేసుకుని హాట్ టాపిక్ గా మరింది. దీంతో రాహుల్, శ్రద్ధ డేటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలాంటి క్రమంలో శ్రద్ధ కపూర్ చేసిన తాజా పోస్ట్ చెర్చ‌నీయాంశంగా ట్రెండ్ అవుతుంది. తాజాగా త‌ను.. రాహుల్ చేయి పట్టుకుని ఉన్న ఫోటోను ఈ అమ్మడు షేర్ చేస్తూ.. తమ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అతని చేయి పట్టుకొని నవ్వుతూ కనిపించిన ఈ అమ్మడు.. నా మనసును తీసుకెళ్ళు కానీ.. నా నిద్రను నాకు తిరిగి ఇచ్చెయ్‌ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జోడించి పోస్ట్ చేసింది. నవ్వుతున్న ఈమోజీలతో పాటు హాట్ సింబల్ ని కూడా ఈ క్యాప్షన్ కు జోడించింది. దీంతో వీరి ల‌వ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిందని అభిమానులు భావిస్తున్నారు.