ప్రభాస్ కల్కి సెన్సార్ టాక్ వచ్చేసిందోచ్.. ప్రభాస్ మరో బ్లాక్ బాస్టర్ కొట్టినట్టేనా..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాకు నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణె నటించింది. అంతేకాదు బాలీవుడ్ బిగ్ బాస్ అమిత బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ సెలబ్రిటీలు కూడా ఇందులో కీలక పాత్రలో మెప్పించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్ ప్రమోషన్స్ ని మరింత జోరుగా సాగిస్తున్నారు.

Kalki 2898 Star Cast Fees: Prabhas's Paycheck 733% Higher Than Ashwatthama Amitabh Bachchan - Big B, Deepika Padukone, Kamal Haasan Take Massive Hikes!

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజ‌ర్, అప్డేట్స్, ఫోటో సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఇటీవ‌ల‌ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా టాక్ బయటకు వినిపిస్తుంది. మూవీ అదిరిపోయింది అంటూ ట్విస్ట్‌లు సినిమాకి హైలెట్గా నిలవ‌నున్నాయంటూ తెలుస్తుంది. బైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడని.. ఇలాంటి సినిమాలు తీయడం ఇలాంటి విజన్‌తో రావడం నాగ అశ్విన్ కు మాత్రమే సాధ్యమవుతుందంటూ.. ఆ రేంజ్ లో సినిమాను అశ్విన్ తెరకెక్కించాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సినిమా మూడు గంటలు నడివితో రానుందట. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ తో పాటు.. క‌ల్కీ టీంకు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక సినిమా భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ మాత్రం ఊహించిన రేంజ్ లో లేవు. అయితే ఇటీవల బుజ్జి అంటూ ఏదో హడావిడి చేసి బుజ్జి అనే వాహనాన్ని ప్రమోషన్ లో భాగంగా ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేశారు మేకర్స్‌.. అప్పటి నుంచి కాస్తో, కుస్తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.