మరోసారి ఆ స్టార్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న మహేష్.. వద్దంటే వద్దంటూ ఫ్యాన్స్ డిమాండ్.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి రానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు మరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు తను నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరువరోకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటివరకు కేవలం 12 సినిమాలు తెర‌కెక్కించిన ఈయన వాటిలో తొమ్మిది సినిమాలను కేవలం పవన్, బన్నీ, మహేష్ లతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

SS Rajamouli shares update on his next with Mahesh Babu

అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతో మూడు మూడు సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్.. బన్నీ, పవన్ కళ్యాణ్ కు యావరేజ్ రిజల్ట్‌ అందించినా.. మహేష్ బాబుకు మాత్రం అలాంటి సక్సెస్ ని కూడా అందించలేకపోయాడు. అతడు, ఖ‌లేజా సినిమాలు కల్ట్ క్లాసిక్‌లుగా తెర‌కెక్కినా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ ను క్రియేట్ చేయలేకపోయాయి. ఇక మహేష్ బాబు నుంచి తెరకెక్కిన చివరి సినిమా గుంటూరు కారం సినిమాకు కూడా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇదైతే మరీ దారుణంగా డిజాస్టర్ అయింది. దీంతో ఎలాగైనా మహేష్ బాబుకి బిగ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో మరోసారి మహేష్ బాబు సినిమా చేయాలని ఆయన ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళితో సినిమా నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమాకు కచ్చితంగా మూడేళ్లు సమయం తీసుకునే అవకాశం ఉంది.

Mahesh Babu has a blockbuster birthday wish for his Guntur Kaaram director  Trivikram Srinivas, posts a cheerful photo with the filmmaker | Telugu News  - The Indian Express

ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అందుకుంటే ఆయన ఇమేజ్ మరింతగా పెరుగుతుంది. దీంతో ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తరికెక్కించే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. దీనికోసం త్రివిక్రమ్ ఎప్పటినుంచకు క‌సురత్తులు చేస్తున్నారని.. పాన్ ఇండియా ఇంపేక్ట్‌ ఉండేలా అదిరిపోయే స్టోరీ లైన్లు మహేష్ కోసం మాటల మాంత్రికుడు సిద్ధం చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు వైర‌ల్ అవడంతో దయచేసి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మాత్రం సినిమా వద్దంటే వద్దు అంటూ మహేష్ బాబును వేడుకుంటున్నారు అభిమానులు. మరి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మరో సినిమా విషయంపై మహేష్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.