బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హ త్వరలోనే వివాహం చేసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఓ ఆడియో ఇన్విటేషన్‌ను రిలీజ్ చేసింది సోనాక్షి. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఫ్యామిలీ మాత్రం పెళ్లికి వ్యతిరేకంగా ఉందంటూ సమాచారం. ఇక తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హ ఆమె పెళ్ళి గురించి మాట్లాడుతూ.. నా కూతురు పెళ్లి గురించి నాకేం తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను అసలు గౌరవించడం లేదని మొహమాటం లేకుండా వివరించాడు. ఇక తాజాగా సోనాక్షి తల్లి, అలాగే ఆమె సోదరుడు ఇద్దరు కూడా ఇన్స్టవేదికగా ఆమెను అన్ ఫాలో చేసినట్లు సమాచారం. ఇక గతంలో సోనాక్షి సిన్హా పెళ్లి గురించి మాట్లాడుతూ తన తల్లి, తండ్రులు ఎప్పుడూ ఆమెను పెళ్లి గురించి బలవంతం చేయలేదని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఈమె చెప్పిన డేట్ కు పెళ్లి చేసుకుంటుందా.. లేదా.. అనే అనుమానాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తండ్రి చేసిన కామెంట్స్.. తల్లి, సోదరుడు కూడా ఇన్స్టా వేదికగా అన్ ఫాలో చేయడం ఇవన్నీ చూస్తుంటే.. అసలు తన కుటుంబానికే ఇష్టం లేకుండా సోనాక్షి పెళ్లి చేసుకుంటుందేమో అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులు, సోదరుడు ఆమెకు అండగా లేకుండా ఇన్‌స్టా వేదికగా అన్ ఫాలో చేయడాన్ని.. ఆమెకు జరిగిన అవమానంగా అభిమానులు భావిస్తున్నారు. ఇక సోనాక్షి తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటుందా.. లేదా.. అనే విషయంపై క్లారిటీ రావాలంటే అమ్మడు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.