అభిమాని కుటుంబానికి అండగా మహేష్.. ప్రశంసలు కురిపిస్తున్న నేటిజన్స్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి వారిలో ఉన్న టాలెంట్ తో పాటు.. అభిమానులు వారిపై కురిపించే ప్రేమ కూడా ఒక విధంగా కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వర‌ల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఈ క్రమంలో అభిమానులు అంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ పూర్తి చేసుకుంటుందా.. ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందా.. అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా మూడు సంవత్సరాల సమయం వరకు పట్టే అవకాశం ఉందట. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా వినిపించలేదు.

The announcement date is locked for most awaited combo of Mahesh babu and  Rajamouli - TrackTollywood

ఇలాంటి క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన పర్సనల్ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారింది. తాజాగా మహేష్ తన అభిమాని కుటుంబానికి సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. దేనితో మహేష్ పేరు మారుమోగిపోతుంది. అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన మహేష్‌ను అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కృష్ణాజిల్లా పెద్దప్రోలు గ్రామానికి చెందిన కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి.. మహేష్‌కు వీరాభిమాని. ఇతనికి భార్య సుజాత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట కృష్ణకు విరాభిమానిగా ఉన్న రాజేష్ తర్వాత మహేష్ కు కూడా మీరు అభిమానిగా మారారు.

అయితే మహేష్ సినిమాల పేర్లను పిల్లలకు పెట్టుకున్నాడు అంటే ఆయనకు మహేష్ పై ఎలాంటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా రాజేష్ కిడ్నీ సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆయన పెద్ద కొడుకు అర్జున్ చెప్పుల షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ ఆయన టీంను వాళ్ళ ఊరికి పంపి రాజేష్ పిల్లలను మంచి స్కూల్లో చదివించాలని.. వారి విద్యకు అయ్యే పూర్తి ఖ‌ర్చును తానే భరిస్తున్నంటూ హామీ ఇచ్చాడట. ప్రస్తుతం మహేష్ చేసిన ఈ మంచి పని వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులతో పాటు నెటిజన్స్ అంతా మహేష్ కు ఫిదా అవుతున్నారు.