అత‌డిని నమ్మి ఏకంగా రూ. 14 కోట్లు నష్టపోయా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు స్నేహితులను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వస్తే అండగా నిలిచి తమ వంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే కొన్ని సందర్భాల్లో ఆర్థికంగాను వారికి అడ్డుగా నిలుస్తారు. అలా తన స్నేహితుడికి కోట్లలో సహాయం చేసి.. నిలువునా మోసపోయానంటూ టాలీవుడ్ హీరోయిన్ రిమిసేన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు నటిస్తున్న రిమి సేన్.. మొదట్లో టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మొదట బెంగాలీ సినిమా పారోమీటర్ ఏక్ దిన్ మూవీ తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్ లో అవకాశాన్ని దక్కించుకొని ఇది నా మొదటి ప్రేమలేఖ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతోపాటే నీ తోడు కావాలి సినిమాలోను నటించింది. కొంత గ్యాప్ తర్వాత మ‌రోసారి అందరివాడు సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.

Andarivadu Box Office Buz, 54% OFF | www.balsanjo.com

ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మ‌డు నటించలేదు. వరుసగా బాలీవుడ్‌ అవకాశాలను దక్కించుకుంటు న‌టించింది. 2016 తర్వత శాస్వ‌తంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇటీవల రిమి మాట్లాడుతూ తన స్నేహితుడి వల్ల రూ.14 కోట్లు నష్టపోయానంటూ.. అతను నన్ను నిలువున మోసం చేసాడంట వివరించింది. మొదట్లో అతనికి రూ.4.14 కోట్లు అప్పుగా ఇచ్చాన‌ని.. ఇప్పుడు మొత్తం కలిపి రూ.14 కోట్లు అయిందని ఆమె వివరించింది. రెండు సంవత్సరాల క్రితం తను పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు ఆ కేస్ సిఐడి వరకు వెళ్లిందని.. నాలుగు సంవత్సరాల క్రితం జిమ్లో రోనాక్ అనే వ్యక్తిని కలిశా.. అతనితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.. ఈ క్రమంలో అత‌నికి డబ్బులు ఇచ్చానని.. నన్ను మోసం చేశాడంటూ వివరించింది. ఆ వ్యక్తి చేతిలో అహ్మదాబాద్‌కు చెందిన‌ చాలామంది మోసపోయారని తెలిసిందంటూ చెప్పుకొచ్చింది.

Chiranjeevi's heroine Rimi Sen gets 'cheated' - Telugu News - IndiaGlitz.com

రోన‌క్‌ మా ఇంటికి కూడా వచ్చేవాడని.. మా అమ్మతో కలిసి భోజనం చేసేవాడని.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి వెళ్లిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది. అధిక వడ్డీ అని చెప్పి మొదట రూ.20 లక్షలు తీసుకున్నాడని 9% వడ్డీ ఇచ్చేవాడని.. రిమి వివరించింది. తర్వాత 12 నుంచి 15% వడ్డీ ఇస్తానని చెప్పాడని.. అలా నేను రూ.4.14 కోట్లు అతనికి ఇచ్చానంటూ వివరించింది. మొదటి నెల రూ.5,6లక్షలు చేతికి ఇచ్చాడని.. తర్వాత వాళ్ళ నాన్నకు కరోనా వచ్చింది అని డబ్బులు ఇవ్వలేమని చెప్పాడంటూ వెల్లడించింది. నెలలు తరబడి సాకులు చెప్పి తప్పించుకోవడంతో ఇది స్కామ్ అని నాకు అర్థమైంది అంటూ చెప్పుకోచిన రిమి సేన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆ ఫిర్యాదు సిఐడి కి బదిలీ అయిందని వివరించింది. ఈ కేస్ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రిమి సేన్‌ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.