బాల‌య్య కోసం ఆ హిట్ సినిమాల సెంటిమెంట్ ఫాలో అవుతున్న బాబి.. వర్క్ అవుట్ అయితే మరోసారి బ్లాక్ బస్టర్ పక్క అంటూ..?!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న‌ బాలయ్య.. నటిస్తున్న‌ సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఒకింత భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా సరవేగంగా చేస్తున్నారు మేకర్స్. షూటింగ్ అంతా త్వరలో పూర్తి చేసుకొని మూవీ రిలీజ్ డేట్ తో పాటు.. టైటిల్ ని ఒకే రోజు అనౌన్స్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం.

Nandamuri Balakrishna teams up with Bobby Kolli for 'NBK 109'; film to  release in 2024 | Telugu Movie News - Times of India

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో జరుగుతుండడం విశేషం. బాలయ్య నటించిన ఎన్నో హిట్ సినిమాలు కర్నూలు జిల్లాల్లో వేరువేరు ప్రాంతాల్లో షూట్ జరుపుకొని మంచి సక్సెస్ లు సాధించాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం బాలయ్య బాబు మూవీ కూడా హిట్టే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతెల ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావడం లేదు.

NBK 109 is a pan-Indian film – Here's the evidence | Latest Telugu cinema  news | Movie reviews | OTT Updates, OTT

చాందిని చౌదరి కూడా ఈ సినిమాలో క్రేజీ రోల్ లో కనిపించనుందట. బాలయ్య బాబి కాంబోలో రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇండస్ట్రీని షేక్‌ చేసే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని.. దానికి తోడు ఈ హిట్ సినిమాల సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్‌ అవ్వడం ఖాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక ఎప్పటికప్పుడు బాలయ్య సినిమాల సీడెడ్ హక్కులకు ఊహించిన స్థాయిలో డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసింది.