కల్కి మూవీలో దీపికా రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆ ఆన్ లక్కీ ఫెలో ఎవరంటే..?!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ కల్కి 2898ఏడి రిలీజ్ అయిన దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే రూ.190 కోట్లకు పైగా గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చిన ఈ సినిమా.. గత మూడు రోజులుగా దాదాపు అని థియేటర్లలోను హౌస్ ఫుల్ చేస్తూ.. మరింత క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం వెయ్యి కోట్ల టార్గెట్ వైపుగా అడుగులు వేస్తున్న ఈ సినిమాల్లో.. అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి ప్రధాన తారాగణం కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటే దిశాపటని, దీపిక పదుకొనే హీరోయిన్గా నటించి మెప్పించారు.

deepika padukone: 'Kalki 2898 AD': Deepika Padukone reveals trailer release  date with new poster; Ranveer Singh calls her a 'stunner' - The Economic  Times

 

ఇక ఇందులో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ లో దిశాపటాన్ని పాత్ర కంటే దీపిక పదుకొనే పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందని సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో తనకి బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో కూడా స్టార్ బ్యూటీగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో సుమతి పాత్రలో కనిపించిన దీపిక పదుకొనే.. గర్భవతిగా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ఒక టాలీవుడ్ స్టార్ బ్యూటీ అవకాశాన్ని మిస్ చేసుకుందంటూ.. ఆమె కంటే అన్లకీ హీరోయిన్ మరెవరు ఉండరు అంటూ వార్తలు నెటింట‌ వైరల్ అవుతున్నాయి.

How Pooja Hegde marks her presence opposite superstars | Hindi Movie News -  Bollywood - Times of India

ఇంతకీ దీపిక పదుకొనే రోల్ ను మిస్ చేసుకున్న ఆ టాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు పూజ హెగ్డే. మొదట దీపికా రోల్లో పూజా హెగ్డే ని హీరోయిన్గా అనుకున్నారట మేకర్స్. అయితే అంతకుముందు ప్రభాస్ తో కలిసి రాదేశ్యామ్‌ సినిమాల్లో నటించగా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో పూజా హెగ్డే ను దారుణంగా ట్రోల్స్ చేశారు మీమ‌ర్స్‌. సరిగ్గా హావ్ భావాలను పలికించకపోవడం వల్లే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ లు కావడంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.