ఆ మంత్రి పదవిలో బాలయ్య.. తెలుగు సినిమా రాతను మార్చగలడా..?!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు తెలుగు ప్రజల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మంచి మనసు గురించి, మాట తీరు గురించి అందరికీ తెలుసు. మాట కఠినంగా అనిపించిన మనసు మాత్రం వెన్న అని సన్నిహితులు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం బాలయ్య ఓవైపు సినిమాల పరంగా మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే రాజకీయంగాను సక్సెస్ సాధిస్తున్నాడు బాలయ్య. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబుకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తోంది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరికీ బాలయ్య విషయంలో ఒకే సందేహం చర్చనీయంశంగా మారింది.

Nandamuri Balakrishna | #NandamuriBalakrishna wins from Hindupur for the 3rd time consecutively with an astounding majority of 31,602 votes 🦁 Hatrick hero,... | Instagram

ఈసారి బాలయ్య‌కు మంత్రి పదవి వస్తుందా. వస్తే అది ఏ శాఖలో వస్తుంది.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు మంత్రిగా పనిచేసే ఆసక్తి బాలయ్య బాబుకు ఉందా.. అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. సినిమాల పరంగా మూడు హ్యాట్రిక్ లతో దూసుకుపోతున్న బాలయ్య.. నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా హిందూపురం ఎమ్మెల్యేగా గత మూడు ఎన్నికల్లో వరుసగా విజయాన్ని సాధించి రాజకీయపరంగాను హ్యాట్రిక్ అందుకున్నాడు. ఈసారి బాలయ్యను మంత్రిగా చూడాలని నందమూరి కుటుంబంతో పాటు ఆయనను అభిమానించే వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రిగా చూడాలని అభిమానులు డిమాండ్ కూడా ఎక్కువైంది.

Sympathy to Chandrababu Naidu for mere political gains: Balakrishna indirectly hits at BRS leaders

2014లోనే బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అభిమానులు ఆశించిన వర్కౌట్ కాలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి బాలయ్యకు ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం. బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే సినిమాటోగ్రఫీ మంత్రిగా అయితే బాగుంటుందని ఆయన ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ విషయంపై సరైన క్లారిటీ లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.