నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సమంత.. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల ఆడప దడప సినిమా ఈవెంట్లలో.. సిటాడాల్ ప్రమోషన్స్ లో కనిపించి సందడి చేసింది. అయితే తరువాత సోషల్ మీడియాకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల సద్గురుకు సంబంధించిన.. తమిళనాడు, కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్ లో సమంత పాల్గొంది.
ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ అక్కడ దిగిన ఫొటోస్ ను షేర్ చేసుకుంది. దీంతో పాటు అద్భుతమైన మెసేజ్ షేర్ చేసింది సమంత. మనలో చాలామంది గురువు కోసం శోధిస్తారు. కానీ మీ జీవితం పై అవగాహనతో వెలుగులు నింపి సరైన మార్గంలో నడిపించే సరైన గురువును మీరు కనుగొనడం చాలా రేర్ గా జరుగుతుంది. జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచాన్ని శోధించాలి.. ఎందుకంటే మన జీవితంలో ప్రతిరోజు చాలా సంఘటనలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో మన ఆలోచనలు సాధారణమో, అసాధారణమో తెలుసుకోవడం కూడా కష్టం.
ఇక్కడ కేవలం పని చేస్తానంటే అవదు.. మనకున్న తెలివితేటలు కూడా నిజ జీవితంలో ఉపయోగించడం చాలా అవసరం అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇక సమంత ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ట్రలాల అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా తన సొంత బ్యానర్ పై సమంత పుట్టినరోజు సందర్భంగా నా బంగారు తల్లి అనే మూవీ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. ఈ మూవీకి సంబందించిన మరిన్ని విషయాలు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.