ఆ సినిమా కోసం ఏకంగా 3 గంటల మేకోవర్.. కమల్ డెడికేషన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..?!

సౌత్ స్టార్ హీరో.. లోకనాయకుడు కమలహాసన్ కు ప్రేక్షకుల‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఏదైనా ఒక కథలో పాత్రను ఎంచుకున్నాడు అంటే దానికి 100% న్యాయం చేయగలను అనిపిస్తేనే దానిని ఎంచుకొని నటిస్తాడు. అలా ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న కమలహాసన్.. ఇప్పుడు కూడా ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే కమల్ హాసన్ మరో ప్రయోగాత్మక పాత్ర ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Kamal Haasan in Kalki 2898 AD: Kamal Haasan's Spine-Chilling Look From  Kalki 2898 AD Trailer Impresses Fans | Times Now

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్.. నాగ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో విలన్ గా క‌మ‌ల్ హాస‌న్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే, దిశా పట్టాని, అమితాబచ్చన్ లాంటి కీలక తారాగణం కూడా నటిస్తుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ ఉండడంతో.. ఇటీవల సినిమా ప్రమోషన్స్ జోరు అందుకున్నాయి. ఇక ఇప్పటికే కల్కి నుంచి అమితాబ్ కు సంబంధించిన అప్డేట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.

Kalki 2898 AD Trailer: Prabhas, Deepika Padukone Film Intertwines  Mahabharat With Dystopian Future - News18

అయితే కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన ఎలాంటి విషయాలను మేకర్స్ రివీల్‌ చేయలేదు. ఇక మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో కమలహాసన్ లుక్ ఎలా ఉంటుందో మాత్రం రిలీజ్ చేశారు. అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అక్కడ కమలహాసన్ ఉన్నాడనే విషయాన్ని గుర్తించలేరు. ఎక్కువ వయసు కలిగిన వయోవృద్ధుడి పాత్రలో.. ముడతలు పడిన ముఖంతో కమలహాసన్ ను చూపించారు. అయితే ఈ విధంగా కమలహాసన్ కనిపించడానికి ఎంతో శ్రమించారట‌. మేకోవ‌ర్‌కీ దాదాపు మూడు గంటల సమయం పడుతుందట‌.

Kalki 2898 AD trailer reactions – Fans call Nag Ashwin's film  'magnificent'; praise Kamal Haasan, Amitabh Bachchan

ఈ మేకోవ‌ర్‌ కోసం విదేశాల నుంచి నిపుణులను ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. ఇలా మేకప్ వేసుకోవడానికి ఏకంగా మూడు గంటలు వెయిట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. అది సౌత్ స్టార్ హీరో పొజిషన్లో దూసుకుపోతున్న కమలహాసన్ లాంటివారు ఒక పాత్ర కోసం ఇన్ని గంటలు వెచ్చించడం అంటే సాధారణ విషయం కాదు అంటూ.. నిజంగా కమలహాసన్ డెడికేషన్ కు ఫిదా అవ్వాల్సిందే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.