అతితక్కువ వయసులోనే నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది అమ్ము అభిరామ్. 17 ఏళ్లకే నట్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. రాక్షసన్, అసురన్, ఏనుగు లాంటి సినిమాలతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధనుష్ నటించిన అసురన్ సినిమాలో హీరో మాజీ ప్రియురాలుగా మరియమ్మ రోల్ ప్లే చేసింది. ఇక తెలుగు రీమేక్ మూవీ నారప్పలో కన్నమ్మ పాత్రలో నటించి మెప్పించింది.
ఆ తర్వాత రణస్థలి, డెవిల్ లాంటి సినిమాల్లోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్న అమ్ము అభిరామ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్ ఉంటే వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అమ్ము అభిరామ్ డైరెక్టర్ పార్ధివ్ మణితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ పార్టీవ్ మణి ఎవరు అనుకుంటున్నారా.. పార్ధివ్ మణి కోమలితో కూక్‌షో సీజన్ల ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ షోలో అమ్ము అభిరాం పాల్గొని సందడి చేసింది.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ రీమింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ తెలుస్తోంది. తాజాగా వారిద్దరి ప్రేమను బయటపెడుతూ అమ్ము అభిరామ్ తన ఇన్స్టా వేదికగా పార్ధివ్‌తో కలిసి ఓ మిర్రర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆ వీడియోను అభిమానలతో షేర్ చేసుకుంది. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే పార్ధివ్.. పుట్టినందుకు, నా జీవితంలోకి రాబోతున్నందుకు దన్యవాదాలు అంటూ వివరించింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో అందరూ ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.