మరోసారి ఐటమ్ సాంగ్ లో నటించబోతున్న పూజా హెగ్డే ..ఈసారి జిగేలురాణికి మించి పోయే రేంజ్ పాట..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తూ ఉండడం సర్వసాధారణం . కొంతమంది హీరోయిన్స్ డబ్బు కోసం అలా చేస్తూ ఉంటే.. మరి కొంతమంది హీరోయిన్స్ పబ్లిసిటీ పాపులారిటీ కోసం అలా చేస్తూ ఉంటారు . కాగా ఇప్పుడు హీరోయిన్ పూజ హెగ్డే మరోసారి తన కెరీర్లు ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఎస్ ప్రెసెంట్ అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజా హెగ్డే వచ్చిన అవకాశాలను చేజార్చుకోవాలి అని అస్సలు వెనకడుగు వేయడం లేదట .

 

అది ఎలాంటి రోల్ అయినా.. ఎంత తక్కువ రెమ్యూనరేషన్ అయినా సరే.. పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ కమిట్ అయిపోతుందట . వాళ్ళు యాడ్స్ లో నటించడానికి కూడా ఓకే చేస్తుందట . రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. పూజ హెగ్డే తన కెరియర్ లో రెండవసారి ఐటమ్ సాంగ్ చేయబోతుందట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిపోయింది.

ఆల్రెడీ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన జిగేల్ రాణి అనే సాంగ్ లో నటించింది . ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత ఐటెం సాంగ్ లో కనిపించలేదు పూజ హెగ్డే. ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించబోతుందట . బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది పూజ హెగ్డే అన్న వార్త ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది..!!