కెరీర్ ఫస్ట్ టైం.. ఆ స్టార్ హీరో కోసం విలన్ మారుతున్న కళ్యాణ్ రామ్..!?

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈమధ్య కాలంలో స్టార్ హీరోస్ పలువురు హీరోల సినిమాలో నటిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము. ఒకటి మల్టీ స్టారర్ ట్రెండ్ అనుకోవడం ..మరొకటి పక్క హీరోలకి హెల్ప్ చేస్తూ ఉండడం ..మరొకటి క్రేజ్ లేని హీరోస్ వేరే హీరో సినిమాలో నటిస్తే క్రేజ్ వస్తుంది అని భావించడం . కొంతమంది మాత్రం ఫ్రెండ్షిప్ కారణంగా ఏదైనా పాత్ర నచ్చితే ఆ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ మరొక స్టార్ హీరో సినిమాలో విలన్ షేడ్స్ లో నటించబోతున్నారట . ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ వేరే హీరో సినిమాలో నటించినే లేదు .. ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్లో కళ్యాణ్రామ్ వేరే హీరో సినిమాలో నటించబోతున్నాడు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్ .

ఎస్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడట . స్పిరిట్ సినిమాలో కళ్యాణ్ రామ్ ప్రభాస్ కి నెగిటివ్ రోల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది . సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో హీరోని ఏ విధంగా చూపిస్తారో హీరో కన్నా..విలన్ లని ఒక మెట్టు ఎక్కువగానే చూపిస్తారు. స్పిరిట్ సినిమా కోసం నెగిటివ్ షేడ్శ్ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ని అప్రోచ్ అయ్యారట మేకర్స్. కళ్యాణ్ రామ్ అందుకు ఓకే చేశారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!