సినీ ప్రియులకు మల్టీప్లెక్స్ లు బంపర్.. మ్యాటర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..?!

సినీ ప్రియుల‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ క్రమంలో 31న సినీప్రియుల‌ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా ఏ భాషలో అయినా.. ఏ సినిమా అయినా మల్టీప్లెక్స్ లలో మాత్రమే రూ. 99 కు టికెట్ తో సినిమాను చూస్తే ఛాన్స్ లో అందించింది. పివిఆర్, ఐనాక్స్, సినీ పోలైస్ లాంటి చైన్ మల్టీప్లెక్స్‌లలో ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని వివ‌రించారు.

Multiplex Association Of India on X: "Cinema Lovers Day returns on 31st May  with movies for just Rs 99/-! 🍿Join us at cinemas across India to celebrate  a day at the movies.

అలాగే ఈ చైన్ మ‌ల్టీప్లెక్స్‌లే కాకుండా దేశంలో నాలుగు వేలకు పైగా ఉన్న ఇత‌ర మల్టీప్లెక్స్‌లలో రూ. 99 కే టికెట్లు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. థియేటర్స్ లో ప్రేక్షకుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లలో టికెట్లు తీసుకుంటే రూ.99 టికెట్ కాస్ట్ తో పాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజ్‌ కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

Multiplex Association of India sets Oct 13 as National Cinema Day |  Entertainment News - Business Standard

ఒకవేళ థియేటర్స్ కౌంటర్ వద్ద టికెట్లు కొనుగోలు చేస్తే ఎటువంటి జిఎస్టిలో, చార్జీలు లేకుండా కేవలం రూ.99 కు టికెట్ను కొనుగోలు చేయవచ్చని వారు వెల్లడించారు. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెటింట వైర‌ల్‌గా మారింది. అదే రోజు టాలీవుడ్‌లో ప‌లు కొత్త సినిమాల రిలీజ్‌కూడా ఉండ‌టంతో సినీ ల‌వ‌ర్స్‌తో పాట్ ఆ హీరోల ఫ్యాన్స్ కూఆ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ను మే 31న సద్వినియోగం చేసుకోండి.