“రేవ్ పార్టీలో ఆమె కూడా ఉంది ఇదిగో ఫోటోస్”..హేమకు దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో షాకిచ్చిన బెంగుళూరు పోలీసులు..!?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెకండ్ కో ట్వీస్ట్ తో దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో అభిమానులకు షాక్ ఇస్తుంది . మనకు తెలిసిందే బెంగళూరు నగర శివారులో తెల్లవారుజామున మూడు గంటల టైంలో రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే పార్టీలో బడాబడా ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో 100 మంది సెలబ్రిటీస్ హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. పలు పెద్ద పెద్ద బెంజ్ కారులు కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు .

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ప్రముఖులు పార్టీకి హాజరైనట్లు పోలీసులు తమ విచారణలో కనిపెట్టారు .వాళ్లలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హేమ కూడా ఉన్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే దానిపై వెంటనే రియాక్ట్ అయింది నటి హేమ . “నేను హైదరాబాదులో ఉన్నాను అని .. బెంగళూరు రేవ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ..ఒక వీడియోని రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది”..

అయ్యో.. పాపం హేమని అడ్డంగా ఇరికించాలి అనుకుంటున్నారు అందరూ అంటూ జనాలు బాధపడిపోయారు . సీన్ కట్ చేస్తే ఆమె వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటలకే రేవ్ పార్టీలో హేమ కూడా ఉంది అంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలతో సహా బయటపెట్టారు. బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ వేసుకున్న డ్రెస్ అదే విధంగా ఆమె రేవ్ పార్టీలో వెళ్లలేదు అంటూ వీడియో రిలీజ్ చేసినప్పుడు హేమ వేసుకున్న డ్రెస్ ఒకటే లా ఉంది . దీంతో హేమ ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అయింది. అంతేకాదు అసలు ఎవరిది నిజం .. హేమ రేవ్ పార్టీకి వెళ్లిందా..? వెళ్లలేదా..? వెళ్తే అబద్ధం ఎందుకు చెప్పింది ..? అన్న కోణంలో జనాలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు . దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!