నాగ చైతన్య పాలిట యమ దూతలులా మారిన ఇద్దరు హీరోలు.. కొంప ముంచేస్తున్నారు కదరా సామీ..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాపం ఇన్నాళ్ళకి లేక లేక హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతూ నాగచైతన్య ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. మరీ ముఖ్యంగా రాత్రి పగలు నిద్ర తేడా లేకుండా .. ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నాడు . అయితే తీరా ఆ సినిమా రిలీజ్ టయానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎదురుకుంటున్నాడు నాగచైతన్య . చందు మొండిటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సినిమా తండేల్.

ఈ సినిమా మొత్తం మత్స్యకారుల జీవిత ఆధారంగా తెరకెక్కింది . ఈ సినిమా కోసం చాలామంది జనాలు హ్యూజ్ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అయితే మొదట ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు . కానీ ఆ టయానికి దేవర సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది . ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో పోటీపడే కెపాసిటీ ఇంకా నాగచైతన్యకు రాలేదు. అది గమనించిన మేకర్స్ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అయితే ఆ సమయానికి కూడా నాగచైతన్యకు పెద్ద తలనొప్పులు క్రియేట్ అవుతున్నాయి . క్రిస్మస్ సందర్భంగా రాబిన్ హుడ్ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

అదే విధంగా నితిన్ హీరోగా వెంకి కూడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా క్రిస్మస్ హాలిడే సందర్భంగా రిలీజ్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . దీంతో పెద్ద తలనొప్పిగా మారిపోయింది నాగచైతన్యకు.. అంతేకాదు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న రాం పోతినేని పూరి జగన్నాథ్ క్రేజీ సినిమా డబల్ ఇస్మార్ట్ కూడా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటున్నాయట .

దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. నాగచైతన్య హిట్ కొట్టడం కన్ఫామ్ కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం కాంపిటీషన్ వస్తే ఆయన సినిమా ఢమాల్ అంటూ పడిపోతుంది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ బయటకు రావడంతో నాగచైతన్య పాలిట వీళ్ళందరూ యమదూతల తయారయ్యారే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్..!