“బుద్ధి లేక నిన్ను నా సినిమాలో పెట్టుకున్న రా”..పాన్ ఇండియా డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరు గురించి ఒకప్పుడు అంటే పరిచయాలు చేయాల్సిన అవసరం ఉండేదేమో కానీ ఇప్పుడు అవసరమే లేకుండా పోయింది. ఈయన తెరకెక్కించే సినిమాలలో బోల్డ్ కంటెంట్ ఎంతగా ఉంటుందో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే కంటెంట్ కూడా అంతే ఉంటుంది. రీసెంట్గా ఆయన తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమా ద్వారా ఆయన ఎంత నెగిటివిటీ క్రియేట్ చేసుకున్నాడో అంతకు డబల్ పాజిటివిటీ క్రియేట్ చేసుకున్నారు. ఏకంగా 900 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డులు నెలకొల్పింది అనిమల్ సినిమా.

అనిమల్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సందీప్ రెడ్డి ని బాగా టార్గెట్ చేశారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటులు అయితే ఆయనపై విరుచుకుపడుతున్నారు . తాజాగా కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు సందీప్ రెడ్డి వంగ పై సంచలన కామెంట్స్ చేశారు కబీర్ సింగ్ సినిమాలో ప్రిన్సిపల్ పాత్రలో కనిపించిన నటుడు.

అదిల్ హుస్సేన్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ పై షాకింగ్ కామెంట్స్ చేశారు . “కబీర్ సింగ్ సినిమా చేసినందుకు నేను పశ్చాతాప పడుతున్నాను . ఆ పాత్ర నేను చేయకుండా ఉండాల్సింది. నేను నటించిన సీన్ మంచిదే కానీ సినిమా కథని నాకు తెలియకుండా నటించాను. ఇలాంటి సినిమానా..? నేను చేసింది అని ఫీల్ అయిపోయాను “అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .

అయితే ఆయన వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా కూడా కౌంటర్ ఇవ్వడం కూడా గమనార్హం. “మీరు నమ్మిన 30 సినిమాల నుంచి రాని పేరు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా నుంచి వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా..? షేమ్ నేను నా సినిమాలో మిమ్మల్ని పెట్టుకున్నందుకు ఇప్పుడు పశ్చతాప పడుతున్నాను. మీ ఫ్యాషన్ కంటే మీ దురాశ పద్ధతి నే ముఖ్యం అనేది నాకు అర్థమైంది ..నేను సినిమాలో మీ ముఖాన్ని ఏఐ సహాయంతో మార్చి మీరు సిగ్గుపడకుండా కాపాడుతాను లేండి . ఇప్పుడు హ్యాపీగా నవ్వుకోండి” అంటూ కౌంటర్ ఇచ్చాడు . దీంతో సందీప్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!