శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి కట్టుకున్న ఈ చీర కాస్ట్ తెలిస్తే నోరెళ్ళబెడతారు..!!

రామ్ పోతినేని హీరోగా వ‌చ్చిన‌ నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో వ‌రుస ఆఫర్లను అందుకుంటు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇలాంటి క్రమంలో సావిత్రి బయోపిక్ మహానటిలో అవకాశాన్ని అందుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఉత్తమ జాతీయ నటిగా అవార్డు దక్కించుకున్న ఈ అమ్మడు తర్వాత తెలుగు, తమిళ భాషల్లోనూ బిజీ అయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్ సినిమాలలో ఎంతో బిజీగా ఉంటున్న కీర్తి.. సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా కీర్తి సురేష్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహ వేడుకల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ తన కుమార్తె పెళ్లి వేడుకలను ఎంతో గ్రాండ్ లెవెల్ లో జరిపారు. తన కుమార్తె పెళ్లి వేడుకల్లో కీర్తి సురేష్ సందడి చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలో నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.

Rednool on X: "Keerthy Suresh At Shankar's Daughter Wedding Function 😍 # KeerthySuresh #Shankar #AditiShankar #AishwaryaShankar @shankarshanmugh  @AditiShankarofl #rednool https://t.co/Pt0kUOmeCn" / X

ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఈ పెళ్లి వేడుకల్లో ఎంతో అందంగా ముస్తాబై సందడి చేసింది. చీరకట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈమె కట్టిన చీర ఖరీదు ఎంత అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ పెళ్లి వేడుకల్లో కీర్తి సురేష్ కట్టిన చీర అక్షరాల 2, 99,000 అని తెలియడంతో అంతా నోరెళ్ళ పెడుతున్నారు. చూడడానికి ఇంత సింపుల్గా కనిపిస్తున్న చీర ఏకంగా అంత ఖరీదు ఉంటుందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంత కాస్ట్లీ చీరను కీర్తి సురేష్ శంకర్ కూతురు పెళ్లిలో కట్టుకొని హాజరయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.