వాట్.. ‘ రాజాసాబ్ ‘ మూవీ ఆలస్యానికి కారణం ఆ బాలీవుడ్ హీరోనా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రభాస్ మొదట వర్షం సినిమాతో భారీ స‌క్స‌స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతూ రోజు రోజుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో వరుస‌ సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్నాడు. చిన్న హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఈ రేంజ్ లో క్రేజ్‌ సంపాదించడం అంటే అది సాధారణ విషయం కాదు. అయితే ప్రస్తుతం భారీ బడ్జెట్‌లో తెర‌కెక్కుతున్న ప్రభాస్ సినిమాలన్నీ డబల్ కలెక్షన్లను వసూలు చేస్తూ టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా దుమ్ము రేపుతున్నాయి.

ఇలాంటి టైంలో మారుతి డైరెక్షన్లో రాజసాబ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలకపాత్రలో నటించినున్నాడని టాక్. ఈ సినిమా మొదలై చాలా సమయం అవుతున్న ఇప్పటివరకు సినిమా పూర్తి కాకపోవడానికి కారణం సంజయ్ దత్ అంటూ తెలుస్తోంది. సంజయ్ దత్ షూటింగ్ ఉందని చెప్పిన ఆయన బిజీ స్కెడ్యూల్ తో సెట్స్ కు హాజరు కాలేకపోతున్నాడని.. దానివల్ల సినిమా ఆలస్యం అవుతుందని టాక్. ఓసారి సంజయ్ దత్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లాలంటే.. ఆయనకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందట.

Uff 🔥 Sanjay Dutt Looks Dashing In Black Kurta Arrives In His Swanky Rolls Royce At Mumbai Airport - YouTube

ఆయనతో పాటు చాలామంది సహాయకులు కూడా ఇక్కడకు రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్లందరినీ ప్రొడ్యూసర్ మెయిన్‌టైన్ చేయాలి. దానికి తోడు సంజయ్ దత్ ముంబై నుంచి హైదరాబాద్ రావాలంటే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సి ఉండడంతో దానికి ప్రొడ్యూసర్ చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోతుందని అందుకే మారుతి, సంజయ్ దత్ ఇద్దరూ ఫ్రీగా ఉన్న సమయంలో ఆయనను పిలిపించి క్యారెక్టర్ మొత్తాన్ని షూట్ చేయించేయాలని మారుతి సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఆయన ఒక్క పది రోజులు త‌న‌ డేట్స్ సినిమా కోసం కేటాయిస్తే సినిమా పూర్తవుతుందని.. కేవలం సంజయ్ డేట్స్ కోసమే సినిమా లేట్ అవుతుందని తెలుస్తుంది.