బాలయ్యకు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? ఇంటికి పిలిచి మరి అలా చేశాడా..?

సాధారణంగా నందమూరి బాలయ్య హీరోయిన్స్ విషయంలో చాలా దూరంగా ఉంటాడు. రాసుకొని పూసుకొని తిరగడం.. లేదా వెక్కిలి చేష్టాలు చేస్తూ ఉండడం.. కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండడం లాంటివి కొంతమంది హీరోలు హీరోయిన్స్ తో చేస్తూ ఉంటారు. కానీ మన బాలయ్య మాత్రం వాటన్నిటికీ దూరం . తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. తన షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిందా ..? హీరోయిన్తో తన పార్ట్ కంప్లీట్ అయిపోయిందా..?

అంతే ..మళ్ళి ఆ హీరోయిన్ గురించి అసలు పట్టించుకోడు . అయితే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అంటే మాత్రం బాలయ్యకు బాగా ఇష్టం అంటూ ప్రచారం జరుగుతుంది . అందుకే ఆయన ఏకంగా తన ఇంటికి పిలిచి ఆమెకు లంగా ఓనితో సత్కరించారట . ఈ న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆమె మరి ఎవరో కాదు శ్రీ లీల . అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కూతురు పాత్రలో కనిపించిన సినిమా భగవంత్ కేసరి .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది వంద కోట్లు కలెక్ట్ చేసింది . ఈ సినిమా టైంలో బాలయ్య -శ్రీలీలకు బాగా ఫ్యాన్ అయిపోయాడు. ఆమె విధివిధానాలు .. ఆమె గౌరవం ఆమె పద్ధతికి ఫిదా అయిపోయాడు . అందుకే ఇంటి పిలిచి మరి ఆడపిల్లకు పెట్టాల్సిన సారె పెట్టి పంపించారట . గాజులు ..పూలు .. లంగా వోని అన్ని కూడా బాలయ్య శ్రీలీలకు కొనిచ్చారట . ఈ న్యూస్ ఇండస్ట్రీలో అప్పట్లో బాగా వైరల్ గా మారింది . మరోసారి ఇదే న్యూస్ లో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!