తారక్ బర్త డే కి ట్రిపుల్ ధమాకా .. ఈసారి కని విని ఎరుగని సర్ప్రైజ్ లు..గెట్ రెడీ రా నందమూరి ఫ్యాన్స్..!

మే 20.. ఇది నార్మల్ తేదీ కాదు . కోట్లాదిమంది ఫ్యాన్స్ కు ఎప్పుడు గుర్తుండిపోయేది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ పుట్టినరోజు సాధారణంగా తమ పుట్టినరోజు కోసం జనాలు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు . కానీ నందమూరి అభిమానులు మాత్రం తమ పుట్టినరోజు కన్నా తమ ఇంట్లో వాళ్ళు పుట్టిన రోజు కన్నా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తేదీని ఎక్కువగా గుర్తు పెట్టుకొని ఉంటారు . ఆ తేదీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు .

తాజాగా తారక్ బర్త్డ డే కి సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది బాగా చూస్తున్నాము. ఓ హీరో పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయడం లేదా ట్రైలర్ రిలీజ్ చేయడం .. ఆయన ప్రజెంట్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం లేదంటే ఫ్యూచర్లో వచ్చే సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేయడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే తారక్ బర్త్డ డే కి ఈసారి ఏకంగా ఒకటి రెండు కాదు మూడు సర్ప్రైజ్లు రాబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

తారక్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమాకి సంబంధించి గూస్ బంప్స్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్న వార్ 2 తారక్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట . అంతేనా ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తారక్ నటిస్తున్న ఎన్టీఆర్ 31 సినిమా నుంచి అదిరిపోయే వీడియోని రిలీజ్ చేయబోతున్నారట .

సాధారణంగా తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజుకి ఒక్క అప్డేట్ రిలీజ్ అయితేనే ఆగలేరు ఫ్యాన్స్ . మరి తారక్ లాంటి హీరో బర్తడే కి మూడు బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలకు సంబంధించిన అప్డేట్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఇక నందమూరి ఫ్యాన్స్ ని ఆపగలమా ..? అసలకి ..ఇప్పటినుంచే సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ తారక్ బర్త డే హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు..!!