వామ్మో.. ఆ యంగ్ హీరోయిన్ కి అక్కగా రష్మిక మందన్న.. అంత ఆ హీరో కోసమేనా..?

రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది . పేరుకు కన్నడ బ్యూటీ నే అయినా తెలుగులో బాగా పాపులారిటి సంపాదించుకుంది . మరి ముఖ్యంగా తన బాడీకి ఏ టైప్ ఆఫ్ కథలు సూట్ అవుతాయి.. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ జోనర్ సినిమాలను చూస్ చేసుకుంటే హిట్ అవుతాయి అన్న విషయం రష్మికకి బాగా తెలుసు . అందుకే అలాంటి హీరోలను చూస్ చేసుకుంటూ వస్తుంది రష్మిక మందన్నా. ప్రజెంట్ రష్మిక మందన్నా.. పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉంది .

ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . కాగా ఇదే మూమెంట్లో రష్మిక మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయింది. ఈ రెండూ కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కావడం గమనార్హం. అయితే రీసెంట్గా రష్మిక మరో సినిమాకి కూడా కమిట్ అయిందట. అయితే ఈ సినిమాలో కేవలం గెస్ట్ పాత్రగానే కనిపించబోతుందట. అది కూడా ఒక యంగ్ హీరోయిన్ కి సిస్టర్ రోల్ లో కనిపించబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

యూట్యూబర్ గా పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య నెక్స్ట్ సినిమాలో రష్మిక మందన ఓ ఇంపార్టెంట్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రను విజయ్ దేవరకొండ కోసమే రష్మిక మందన్నా చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది . విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది వైష్ణవి చైతన్య . ఈ క్రమంలోనే తమ్ముడికి పెద్ద హిట్ ఇచ్చిన హీరోయిన్ సక్సెస్ కోసం రష్మిక మందన్నాను రంగంలోకి దింపాడు రౌడీ హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇన్నాళ్లు హీరోయిన్గా చేసిన రష్మిక మందన్నా.. ఇప్పుడు అక్క పాత్రలో కనిపిస్తుంది అనేసరికి ఫ్యాన్స్ కొంచెం డౌట్లు పడుతున్నారు. చూడాలి అమ్మడు స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో ..? తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే..!