కలర్స్ స్వాతి బర్త డే స్పెషల్: ఇండస్ట్రీలో అలాంటి పని చేసిన ఒక్కే ఒక్క హీరోయిన్ ఈమె..!

కలర్స్ స్వాతి.. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఆ పేరు నే తన ముందుకు చేర్చుకుంది. కలర్స్ స్వాతి అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు . చాలా క్యూట్ గా ఉంటుంది .. చాలా చక్కగా ఉంటుంది. తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు .. ఎటువంటి పాత్రనైనా సరే అవలీలగా నటించగలరు .. స్వాతి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదగాల్సినటువంటి కటౌట్ కానీ, ఆమె ఎందుకో స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది .

నేడు ఆమె పుట్టినరోజు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు ఫ్యాన్స్.. ఫ్యామిలీ మెంబర్స్.. శ్రేయోభిలాషులు ఆమెకు బర్త డే విషెస్ అందజేస్తున్నారు. అంతేకాదు స్వాతి బర్త్డ డే సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తున్నారు . స్వాతి చాలా సినిమాల్లో నటించింది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా తన క్యారెక్టర్ నచ్చితే ఆ పాత్రను కూడా చేసింది . అయితే ఈ మధ్యకాలంలో స్వాతి నటించిన సినిమాలు హిట్ కాలేకపోయాయి .

అంతేకాదు స్వాతిని చాలామంది.. దారుణంగా ట్రోల్ చేశారు . ఈ క్రమంలోనే స్వాతి ఒకానొక ప్రెస్ మీట్ లో ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది. తనపై నెగటివ్ వార్తలు రాస్తున్న వాళ్లను ఏకిపారేసింది . అంతేకాదు ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ గానే పేర్లతో సహా బయట పెడుతూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. నిజానికి ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇలా ఉండరు. చాలా భయం భయంగా ఉంటారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో ఆఫర్లు రావేమో అంటూ బిక్కు బిక్కున ఉంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా ధైర్యంగా తప్పును తప్పు అంటూ వేలెత్తి చూపి అందరి చేత శభాష్ అనిపించుకునింది కలర్స్ స్వాతి..!!