నటుడు ప్రియదర్శికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నభా నటేష్.. లిమిట్స్ దాటి ప్రవర్తించకు అంటూ ఫైర్ అయినా స్టార్ బ్యూటీ..?!

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ చాలా వైవిధ్యంగా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈజీగా జనాల్లోకి సినిమాను తీసుకెళ్లేందుకు వినూత్నమైన ప్రయత్నాలను చేస్తున్నారు. ఊహించని విధంగా వీధుల్లోకి వచ్చి అల్లరి చేయడం.. లైవ్‌లో సిల్లీ రీజ‌న్‌ల‌కు యాంకర్ తో గొడవ పెట్టుకోవడం.. ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకుని చేస్తున్న విష‌యం తెలియక జనం కూడా అసలు ఈవెంట్లో గొడవ ఎందుకు జరిగి ఉంటుంది.. అనే ఆసక్తితో ఆటోమేటిక్గా ఈవెంట్ ను చూస్తున్నారు. దీంతో ఆ సినిమాకు సాధారణంగా భారీ ప్రచారం లభిస్తుంది. ఇదో కొత్త స్ట్రాటజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా మాట‌ల యుద్ధం చేసుకున్నారు.

DESI ACTRESS PICTURES: Images for Nabha Natesh Photo Shoot ☆ Desipixer ☆

అయితే ఇది కూడా పబ్లిసిటీస్ స్టంటే అని అంతా భావిస్తున్నారు. రీసెంట్ గా నభా న‌టేష్‌కి నటుడు ప్రియదర్శికి ఎక్స్ ట్విట్టర్ వేదికగా చిన్న వార్ జరిగింది. ఈ గొడవ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే హీరో ప్రభాస్ వాయిస్ తో డబ్ స్మాష్ వీడియోను తాజాగా న‌భా షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ పై ప్రియదర్శిని స్పందిస్తూ సూపర్ డార్లింగ్.. కిర్రాక్.. అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే దీనికి నభా స్పందిస్తూ ఐసీసీ సెక్షన్ 354 ఏ ప్రకారం పరిచయం లేని ఒక స్త్రీని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం.. అన్ని రాసి ఉన్న‌ మెసేజ్ ను ట్యాగ్ చేస్తూ.. మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త అంటూ రాసుకొచ్చింది.

Young Actor in Huge Demand

ఇక దానికి ప్రియదర్శి స్పందిస్తు మనకు పరిచయం లేదన్న విషయం నాకు తెలీదు.. కాక‌పోతే మీరు అయితే అంద‌రిని డార్లింగ్ అనొచ్చు.. కానీ మేమంటే మాత్రం సెక్షన్స్ ఆ అంటూ ప్రియదర్శి ప్రశ్నించాడు. లైట్ తీసుకో డార్లింగ్.. అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఇస్మార్ట్ బ్యూటీ కోపం నషాలానికి అంటుకుంది. లిమిట్స్ దాటి ప్రవర్తించకు.. తర్వాత చూసుకుందాం అంటూ సీరియస్గా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ చాటింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఎవరికి నచ్చినట్టు వారు స్పందిస్తున్నారు. కొందరైతే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని.. దానికి ప్రమోషన్స్ లో భాగంగానే ఇలాంటి స్టాంట్లు చేస్తున్నారని.. అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం నిజంగానే మీరు సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.