వారానికి ఒకసారైనా అలాంటి పని చేసే వాడిని.. కానీ నా కొడుకు పుట్టాక అది కుదరడం లేదు.. నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!v

టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిఖిల్ సిద్ధార్థ్ డైరెక్టర్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన భర్య‌ ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త చెప్పి ఫాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. ఫిబ్రవరి 21న పల్లవి ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కానీ బాబు ఫేస్ మాత్రం వివిల్ చేయలేదు. తాజాగా, నిఖిల్ తన కొడుకు పేరు రివిల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

” నా కొడుకుకు ధీర సిద్ధార్థ్ అని పేరు పెట్టాము. అయితే పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు కాబట్టి నేను ప్రతిరోజు అతనితో సమయం గడపటానికి ప్రయత్నిస్తూన్నాను. పల్లవి తో బాధ్యతలు పంచుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను కనీసం వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లే వాడిని, కానీ ఇప్పుడు ఆ పని చేయటం మానేశాను. మీరు తల్లిదండ్రులుగా మారిన తర్వాత చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచిగా మారాల్సిందే.

పిల్లలకు మంచి మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటి దూరం కాక తప్పదు. 15 సంవత్సరాల క్రితం ఎవరైనా నా జీవితం ఇంత మంచిగా మారుతుందని చెబితే, నేను వ‌త్తిడిని తగ్గించుకుని సంతోషంగా ఉండేవాడిని ” అంటూ చెప్పుకొచ్చాడు. నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ‘ స్వయంభు’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీనిని డైరెక్టర్ కృష్ణ మా చారి తర్కెక్కిస్తుండగా..నవ నటేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల నభా స్వయంభు షూటింగ్ లో జాయిన్ అయినట్లు ఓ వీడియోను షేర్ చేసి ఫాన్స్ ను ఆశ్చర్యపరిచింది.